Stock Market Open | దేశీయ స్టాక్ మార్కెట్లు గత సెషన్‌తో తొలిసారిగా జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఆల్‌టైమ్‌లో ముగిసిన మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి.
ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ షేర్లలో నష్టాలతో మార్కెట్లు పతనమయ్యాయి. ఉదయం 9.24 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 176 పాయింట్ల పతనమై.. 82,793 పాయింట్ల వద్ద మొదలైంది. నిఫ్టీ 59 పాయింట్ల దిగజారి 25,329 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హెచ్‌యూఎల్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, నెస్లే షేర్లు లాభపడ్డాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో ఎఫ్ఎంసీజీ తగ్గాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్, గ్యాస్ సూచీలు సైతం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
అదానీ గ్రూప్ షేర్లు ప్రారంభ ట్రేడ్‌లో స్వల్పంగా పడిపోయాయి. సింగిల్ స్టాక్ స్టాక్‌లలో ఐఆర్సీటీసీ 3శాతం లాభపడింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రైల్వే సంస్థలో తన వాటాను 7.278 శాతం నుంచి 9.298 శాతానికి పెంచుకున్నది. గురువారం మార్కెట్ ముగిసిన అనంతరం భారత్‌లో ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలో సెంట్రల్ బ్యాంక్ 4శాతం లక్ష్యం కంటే దిగువన ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.65శాతానికి పెరిగింది. జూలై నెలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల నమోదైంది. పెరుగుతున్న ధరలు రాబోయే ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశంలో రేటు తగ్గింపు అంచనాలను మరింత తగ్గించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.