ఆత్మకు పట్టణ పరిధిలో కుక్కల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బైక్ లపై వెళ్లే వారిని మాత్రమే కాదు కారులో వెళ్లిన వారిపై కూడా వెంట పడుతున్నాయి. పలుమార్లు కుక్కలు దాడి చేస్తుండడంతో ప్రజలు గాయపడుతున్నారని.. అధికారులు విస్మరిస్తున్నారని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్లాంపేట, నంద్యాల టర్నింగ్ ప్రాంతాల్లో మాంసం దుకాణాలు ఉండటంతో ఈ ప్రాంతంలో ఒక్కో గుంపులో 20కి పైగా శునకాలు సంచరిస్తున్నాయి.
గ్రామ సింహాల దెబ్బకు ఆ పట్టణ వాసులు విలవిలలాడుతున్నారు. కుక్కల్ని చూసినా , కనిపించినా అమ్మో .. అంటూ పరుగులు తీస్తున్నారు. స్కూల్ కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు పిల్లల భయాన్ని వర్ణించలేమని అంటున్నారు కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణ వాసులు. పట్టణ పరిధిలో పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. రాజావీధిలో ఓ మహిళను కరుస్తుండగా కుక్క నుంచి విడిపించేందుకు వచ్చిన వారిపైనా దాడి చేసింది. రాజా వీధి, SPGపాలేం,పెద్ద బజారు, నగర పంచాయతీ కార్యాలయం ప్రాంతాల్లో దాదాపు 40 మందిపై శునకం దాడి చేసింది. 22 మందికి తీవ్రగాయాలయ్యాయని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పురపాలక సిబ్బంది కుక్కను పట్టుకున్నారని కమిషనర్ శ్రీనివాస రావు వెల్లడించారు.
పట్టణంలో కుక్కలను పట్టుకోమని పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఎవరు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఆత్మకు పట్టణ పరిధిలో కుక్కల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బైక్ లపై వెళ్లే వారిని మాత్రమే కాదు కారులో వెళ్లిన వారిపై కూడా వెంట పడుతున్నాయి. పలుమార్లు కుక్కలు దాడి చేస్తుండడంతో ప్రజలు గాయపడుతున్నారని.. అధికారులు విస్మరిస్తున్నారని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మకూరులో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. అధికారులు కట్టడి చర్యలు చేపట్టకపోవడంతో వీటి సంతతి రోజురోజుకు అధికమవుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా గుంపులుగా సంచరిస్తున్నాయి. ప్రధాన రహదారు లతో పాటు కాలనీల్లోని వీధుల్లో పదుల సంఖ్యలో గుమికూడి అటుగా రాకపోకలు సాగించే వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇంటి బయట ఆడుకునే చిన్నారులను గాయపరుస్తున్నాయి. వీధికుక్కల నియంత్రణలో అధికారులు విఫలమయ్యారని కౌన్సిల్ సమావేశంలో కౌన్సి లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాసరే చర్యలు కరవయ్యాయి. పట్టణంలోని గరీబ్ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి, కొత్తపేట, కిషన్ సింగ్ వీధి, కప్పలకుంట, వడ్లపేట. ఎస్పీజీ పాలెం, ఏబీఎంపాలెం, రహ్మత్ నగర్, ఇందిరానగర్ లో కుక్కల సంచారం అధికంగాఉంది. మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కుక్కల గుంపులుగా సంచరిస్తున్నాయి.
ఇస్లాంపేట, నంద్యాల టర్నింగ్ ప్రాంతాల్లో మాంసం దుకాణాలు ఉండటంతో ఈ ప్రాంతంలో ఒక్కో గుంపులో 20కి పైగా శునకాలు సంచరిస్తున్నాయి. పాఠశాలకు, దుకాణాలకు వెళ్లే పిల్లలను వెంబడిస్తున్నాయి. ఇళ్ల ముందు ఆడుకుంటున్న వారిపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. వడ్లపేట, కిషన్ సింగ వీధి, రహ్మత్ నగర్ , కొత్తపేట, ఖల్లా వీధుల్లో కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు.
నియంత్రణలో విఫలం
వీధికుక్కల నియంత్రణలో పాలక వర్గం, అధికారులు విఫలమవుతున్నారు. వీధుల్లో సంచరించే కుక్కలను పట్టించి నంద్యాలకు తరలించి కు.ని శస్త్రచికిత్సలు చేయించాల్సి ఉంది. ఇలా చేయడం వలన కుక్కల సంతతి పెరగకుండా చూడొచ్చు. గతంలో రూ. 3 లక్షలు వెచ్చించి శునకాలను పట్టుకుని నంద్యాలకు తరలించారు. ఇందుకు సంబంధించిన బిల్లులు ఇంత వరకు కుక్కలను పట్టినవారికి చెల్లించలేదు. దీంతో వారు తాము మళ్లీ కుక్కలను పట్టమని చెబుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కలను కట్టడి చేయాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు.