వైట్ బాల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా.. క్రికెట్ చాలా మారింది. క్రికెట్ ను ఓ క్రీడగా చూసే రోజులు పోయి.. భారీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ జరిగే రోజులొచ్చేశాయి.
ముఖ్యంగా ఐపీఎల్ రాకతో మార్కెట్ లెక్కలన్నీ తారుమారయ్యాయి.
ఇండియాలో మొత్తం క్రీడల పేరుతో జరుగుతున్న సింహ భాగం బిజినెస్ క్రికెట్ దే. ఈ గణాంకాలు చూస్తే చాలు.. దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిషర్లు వదిలి వెళ్లిన క్రికెట్.. ఇప్పుడు ఇండియాలో మార్కెట్‌ను శాసిస్తోంది.
అలాంటి జెంటిల్ మెన్ గేమ్‌లో జూలు విదిల్చి ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డ్‌ను అలుపు లేకుండా పరుగులు పెట్టించే క్రీడాకారులు సంపాదనలో సైతం పోటీపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ టెక్ కంపెనీల సీఈవో సంపాదన కంటే వీళ్ల ధనార్జనే ఎక్కువ. అంత క్రేజ్ ఉన్న క్రికెట్ క్రీడా విభాగంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో మీకు తెలుసా?
సీఈవో వరల్డ్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం..ఆడమ్ గిల్‌క్రిస్ట్ నెట్ వర్త్ 380 మిలియన్ డాలర్లు, సచిన్ టెండూల్కర్ నెట్ వర్త్ 170 మిలియన్లు, ఎంఎస్ ధోనీ 115 మిలియన్లు, విరాట్ కోహ్లీ 112 మిలియన్లు, రికీ పాంటింగ్ 75 మిలియన్లు, జాక్వెస్ కల్లిస్ 70 మిలియన్లు, బ్రియాన్ లారా 60 మిలియన్లు, వీరేంద్ర సెహ్వాగ్ 40 మిలియన్లు, యువరాజ్ సింగ్ 35 మిలియన్లు, స్టీవ్ స్మిత్ 30 మిలియన్లతో అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్నారు.