విజయవాడ సెప్టెంబర్ 9 (ఆంధ్రపత్రిక): బ్రిటీష్ మహారాణి రెండవ ఎలిజబెత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎలిజబెత్ మూడు సార్లు ఇండియాలో పర్యటించారు. 1961లో తొలిసారి ఆమె భారత్‌ను విజిట్ చేశారు.
ఆ పర్యటన తర్వాత భారత్‌తో క్వీన్ ఎలిజబెత్ అనుబంధం పెరిగింది. మళ్లీ 1983లో ఆమె ఇండియాకు వచ్చారు. ఇక చివరిసారి 1997లో క్వీన్ భారత్‌లో పర్యటించారు. భారత్‌కు బ్రిటీషర్లు స్వాతంత్య్రాన్ని ప్రకటించడం, క్వీన్ జెలిజబెత్ మహారాణి కావడం మధ్య అయిదేళ్ల గ్యాప్ ఉంది. బ్రిటీషర్లు ఇండియాను సుమారు 200 ఏళ్లు పాలించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తన నివాళి సందేశంలో క్వీన్ ఎలిజబెత్‌ను గుర్తు చేసుకున్నారు. క్వీన్ పెళ్లికి మహాత్మా గాంధీ ఆమెకు హ్యాండ్కర్చీఫ్ను గిఫ్ట్‌గా ఇచ్చారని, ఆ కర్ఛీఫ్‌ను తనకు ఆమె చూపించినట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు.