Pool Exercises: నీటిలో ఈ వ్యాయామాలు చేయండి, ఇట్టే కొవ్వు కరిగిపోతుంది
బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించడానికి ఎన్నో రకాల వ్యాయామాలు ఉంటాయి. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే నీటిలో చేసే వ్యాయామాల గురించి తెలిసి ఉంటుంది.
పూల్ వ్యాయామాలు అనగానే స్విమ్మింగ్ చేయడమేమో అనుకుంటారు. కానీ పూల్ ఎక్సర్సైజ్లు అంటే ఆక్వా సైక్లింగ్, ఆక్వా యోగా, నీటిలో రన్నింగ్ లాంటివి చాలా ఉంటాయి.
ఈ సమ్మర్ లో వ్యాయామం చేయడంతో పాటు నీటిలో చల్లగా ఆహ్లాదంగా గడిపే వర్కవుట్స్ గురించి వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నీటిలో వ్యాయామంతో ప్రయోజనాలు:
ఇతర వ్యాయామాల లాగే నీటిలో చేసే వ్యాయామాలతో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వీటి వల్ల కొవ్వు కరగడంతో పాటు, కండరాలు బలపడతాయి. హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీర బరువు తగ్గుతుంది:
నీటిలో చేసే వ్యాయామాల ద్వారా కాళ్లు, కీళ్లు, ఎముకలపై భారం తగ్గుతుంది. రన్నింగ్, వెయిట్ ట్రైనింగ్, మోకాళ్లు, చీలమండలు, ఇతర కీళ్లపై ఒత్తిడి చూపిస్తాయి. పూల్ ఎక్సర్సైజుల వల్ల ఈ సమస్య ఉండదు.
ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్లను ప్రభావితం చేసే జబ్బులతో బాధపడే వారికి పూల్ ఎక్సర్సైజులు మంచి ఎంపిక అవుతాయి.
1. నీటిలో నడవడం
నీటిలో నడవడం మంచి వ్యాయామం. నీటిలో వ్యాయామం చేయడం మొదలు పెట్టేవారు మొదటగా చేయాల్సిన వ్యాయామం ఇది. నీటిలో నడవడం చేతులు, కోర్, దిగువ శరీరాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. చేతులు, చీలమండ బరువులు ఉపయోగించి తీవ్రతను పెంచవచ్చు.
2. వాటర్ ఆర్మ్ లిఫ్టులు
ఈ వ్యాయామం చేతుల్లోని కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఫోమ్ డంబెల్స్ ఉపయోగించి మరింత రెసిస్టెన్స్ ను జోడించడంలో సహాయపడుతుంది.
3. బ్యాక్ వాల్ గ్లైడ్
ఈ వ్యాయామంతో కోర్, దిగువ శరీరంలోని కండరాలు బలోపేతం అవుతాయి. కాళ్లతో గోడను నెడుతూ వీలైనంత వరకు వెనక భాగంలో తేలాలి.
4. జంపింగ్ జాక్స్
జంపింగ్ జాక్స్ ఎగువ, దిగువ శరీరం రెండింటిలోనూ కండరాలను బలోపేతం చేస్తాయి. మణికట్టు, చీలమండ బరువులతో రెసిస్టెన్స్ ను జోడించవచ్చు.