రాజధాని సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం,అక్టోబర్ 31 (ఆంధ్రపత్రిక): రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖలో ఉన్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ వదిలి రాలేరని అన్నారు. ఆయనకు అమరావతి రియల్ ఎస్టేట్ భూమిగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. సోమవారం జిల్లాలో జరిగిన మన రాజధాని ` మన విశాఖ సదస్సులో మంత్రి మాట్లాడుతూ… పెద్ద రాజధాని వద్దని శివరామకృష్ణ కమిటీ సలహా ఇచ్చిందని తెలిపారు. పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చిందన్నారు. అభివృద్ధిలో అసమానత ఉంటే అస్థిరత ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని కోసం రహస్యంగా 3500 జీవోలు ఇచ్చారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రజల్లో సీరియస్ నెస్ పెంచేందుకే రాజీనామా అన్నానని తెలిపారు. విశాఖ రాజధాని అవకాశం ఇప్పుడు పోతే మళ్లీ రాదని… నివేదికలు, నిపుణులు చెప్పినట్లే సీఎం జగన్ (జా తీజీణజీని పనీఠజీని స।టటా)చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు ఏం స్టడీ చేశాయని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోకవద్దని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఇదిలావుంటే ఏపీలో మూడు రాజధానుల కధ చివరిదశకు చేరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీని విూద సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విూద విచారణ జరిగి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే క్షణమైనా ఆలస్యం చేయకుండా విశాఖ రాజధాని అవుతుంది. ఒక వేళ తీర్పు ఏమైనా ప్రతికూలంగా వచ్చినా అమరావతి పేరుకు రాజధానిగా ఉంటుంది కానీ విశాఖ అసలైన రాజధాని అవుతుంది. అంటే రాజధాని అని దానికి ప్రత్యేకంగా పేరు పెట్టరు, అలా ఎక్కడా కూడా అఫీషియల్ గా పిలవరు. కానీ జరిగేదంతా అలాగే ఉంటుంది. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్నది అనాదిగా జరుగుతున్న విషయం. ముఖ్యమంత్రి జగన్ విశాఖకు షిప్ట్ అవుతారు. ఆయనతో పాటే సచివాలయం, అలాగే మంత్రులు అంతా కూడా విశాఖకే షిప్ట్ అవుతారు. అసెంబ్లీ మాత్రం అమరావతిలో ఉంటుంది. న్యాయ రాజధానికి కేంద్రంలోని బీజేపీ కూడా సుముఖంగా ఉంది. అయితే దాని పేరు కూడా రాజధాని అని పిలవకుండా హై కోర్టు అక్కడకు మార్పు చేస్తారు. అంటే మూడు రాజధానులు అని ప్రత్యేకంగా చట్టం చేయకుండా రాజ్యాంగ పరిధిలు పరిమితులకు లోబడి కూడా వికేంద్రీకరణ చేయవచ్చు. ఆ దిశగానే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆలోచనలు సాగుతున్నాయి. దీనివిూద ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది. సాధ్యమనంత త్వరలోనే దీనికి సంబంధించిన పక్రియ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆఫీస్ విశాఖలో సిద్దం అవుతోంది. అందువల్ల మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి ఒక తార్కికమైన ముగింపు తొందరలోనే ఏపీ అంతా చూడబోతోంది అన్నది వైసిపి నేతలను బట్టి తెలుస్తోంది