రణ్వీర్ సింగ్, దీపికల విడాకులపై ర్యూమర్లు
అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక): ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. దానిక్కారణం ఇటీవల కొంతమంది స్టార్ కపుల్ డైవర్స్ తీసుకోవడమే. అయితే రీసెంట్ గా మరో బాలీవుడ్ కపుల్ పైనా ఈ రూమర్స్ వస్తున్నాయి. వాళ్లే దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్. బాలీవుడ్ జంటలలో కాస్త డిఫరెండ్ గా కనిపించే ఈ జంటా డైవర్స్ తీసుకుంటున్నారంటూ సోషల్ విూడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రూమర్స్ కు దీపికా ఇన్ డైరెక్ట్ గా సమాధానం ఇచ్చింది. రణ్ వీర్ సింగ్ వారం రోజులుగా మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొంటున్నాడని, అతను ఇంటికి వచ్చి తనని చూడగానే తప్పకుండా సంతోషిస్తాడని చెప్పింది. పరోక్షంగా తమపై ఆయన ప్రేమ తగ్గలేదని, తనక్కూడా అలాంటి ప్రేమే ఉందని వివరణ ఇచ్చింది.
దీంతో ఇన్ని రోజులు తమ అభిమాన నటీనటులు విడిపోతున్నారన్న వార్తతో కలత చెందిన ఫ్యాన్స్ కు ఉపశమనం కలిగినట్టు తెలుస్తోంది. రణవీర్, దీపికా ఆరేళ్ల డేటింగ్ తర్వాత నవంబర్ 14, 2018న పెళ్లి చేసుకున్నారు. అయితే రీసెంట్ గా ఈ ఇద్దరు స్టార్ల మ్యారేజ్ లైఫ్ గురించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. వీరి వివాహ బంధం గురించి కొన్ని పుకార్లు షికారు చేశాయి. ఒకరంటే మరొకరికి పడటం లేదని, ఈ ఇద్దరూ తొందర్లోనే విడాకులు తీసుకోబోతున్నారని కొన్ని వారాలుగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, సోషల్ విూడియా వేదికగా ఒకరిపై మరొకరు తమ ప్రేమను చూపిస్తూ ఈ వార్తలను రణ్వీర్, దీపికా ఖండిస్తూనే ఉన్నారు. అయినా అవి అగడం లేదు. తాజాగా దీపికా చెప్పిన సమాధానంతోనైనా ఈ రూమర్స్ ఆగుతాయేమో చూడాలి మరి.