జిల్లా వైఎస్సార్సీపి మహిళా విభాగం
అధ్యక్షురాలుగా ఈర్లె అనూరాధ
కె.కోటపాడు,ఫిబ్రవరి23(ఆంధ్రపత్రిక):
వై.ఎస్.అర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వై.ఎస్. అర్.సి.పి.అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా మండల జడ్పీటీసీ(జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం)సభ్యురాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్పర్సన్ ఈర్లె అనూరాధ నియమితులయ్యారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు తనయి అనూరాధ వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియామాకంపట్ల మండల పరిషత్ అధ్యక్షులు రెడ్డి జగన్మోహన్, స్థానిక ఉప సర్పంచ్ రెడ్డి అరుణ, మండలంలో పార్టీకి చెందిన పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.