రావికమతం ఫిబ్రవరి 9 (ఆంధ్రపత్రిక): కౌగుంట గ్రామపంచాయతీలో ఇటీవల నిర్వహించిన జగనన్న భుహక్కు, భూరక్ష పథకం ద్వారా జరిగిన రీ సర్వే నోటీసులను సర్పంచు దాసరి సూర్యకుమార్ వరహాలు చేతుల మీదుగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు గురువారం అందజేసారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న భూహక్కు, భూ రక్ష, సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇటీవల సర్వే చేసిన రైతుల భూమి వివరాలు రైతులకు అందించడం జరుగుతుందన్నారు. వాటిలో తప్పు తడకలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవచ్చని తెలిపారు. ప్రారంభంలో కవగుంట రెవెన్యూ లో చేసిన సర్వే టీము పూర్తిగా తప్పు తడకలు, రిపోర్టులు వలన సర్వే సరిగా లేదన్నారు. దీనివలన రైతులు పలువురు ఆందోళనకుల గురయ్యారన్నారు.మరలా తిరిగి ఫిర్యాదు రూపంలో కాగితాలు తీసుకొని నోటీసులు రాని వాళ్ళకి భూమి మీదకి వెళ్లి భూమి చూసుకొని వెంటనే వారికి 9(2) నోటీసులు రాసి ఇవ్వడం జరుగుతుందన్నారు.అలాగే మరి కొంతమందికి భూమి ఎక్కువ ఉండి తక్కువ నమోదు కావడం, సర్వే నెంబర్లు తప్పుగా నమోదు అవ్వడం మొదలగువాటిని అన్నిటిని గుర్తించి సరి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం భూముల వివరాలను పక్కాగా రికార్డు ఆన్లైన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కవగుంట రెవిన్యూలో 1150 పొలాలను సర్వే నిర్వహించడం జరిగిందని సర్వే బృందం ప్రతినిధి రవి తెలిపారు. ఈ సర్వే ద్వారా మనం సాగు చేస్తున్నటువంటి భూమికి గత రికార్డు కి ఉన్న తేడాలను అలాగే తప్పుడు సర్వే నెంబర్లను గుర్తించి సరి చేయడం, మరి కొంతమందికి భూమి సాగులో ఉంటారే తప్ప వారికి హక్కు పత్రాలు లేకపోవడం మొదలగునవన్నీ ఈ సర్వే ద్వారా వారిని గుర్తించడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామకంఠం, గడ్డ పోరంబోకులు, చెరువు ఆక్రమణలు, పంట కాలువల ఆక్రమణలు, మినహాయించి రైతులకు సర్వే ద్వారా వారి రికార్డు తయారు చేయడం జరుగుతుందన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!