మునగపాక ఫిబ్రవరి 15 (ఆంధ్ర పత్రిక ) ; పూర్తిస్థాయిలో పోషకాహారాన్ని అందించడం ద్వారా క్షయ వ్యాధి నివారణకు కృషి చేయవచ్చునని డాక్టర్లు ఇస్తేర్ రాణి, వినోద్ కుమార్ లు తెలిపారు. చూచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో క్షయ వ్యాధిగ్రస్తుల కు బుధవారం పోషకాహార పంపిణీ చేపట్టారు. ఇద్దరు వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని వారికి పోషకాహారాన్ని తమ సొంత ఖర్చులతో అందజేశారు. పాలు, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా మంచి పోషకాహారం పొందవచ్చునని వారు తెలియజేశారు. పోషకాహార లేమితో వచ్చే క్షయ వ్యాధిని పోషకాహారం అధికంగా ఇవ్వడం ద్వారా నివారించవచ్చునని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది యాళ్ల కృష్ణ, ప్రేమ కుమారి, సాంబమూర్తి, గణేష్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!