జయపుర,అగస్టు16(ఆర్ఎన్ఎ): స్వాతంత్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం రాజస్దాన్లోని బర్మార్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ పంపిణీ చేయడం కలకలం రేపింది. గుడమలని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒపియం, పప్పీ హస్క్ వంటి నిషేధిత డ్రగ్స్ సేవించారని చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి ఓంప్రకాష్ విష్ణోయ్ వెల్లడిరచారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ విూడియాలో వైరల్గా మారాయి. స్వాతంత్య వేడుకలు ముగిసిన అనంతరం దాదాపు పదిమందికి పైగా పాఠశాలకు చేరుకుని అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. నిందితులు డ్రగ్స్ సేవిస్తున్నట్టు వైరల్ వీడియోల్లో కనిపించింది. ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత అధికారులు
అక్కడికి చేరుకునే సమయానికి నిందితులు ఎవరూ లేరని విష్ణోయ్ తెలిపారు. విద్యార్ధులు, టీచర్ల స్టేట్మెంట్ నమోదు చేసుకుని నిందితుల ఆచూకీ పసిగడతామని చెప్పారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని విష్ణోయ్ వెల్లడిరచారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!