పాలిటెక్నిక్ సీట్ల కేయింపుపై ఆగస్టు 20న ఎస్ఎంఎస్ రూపంలో విద్యార్ధులకు నేరుగా చరవాణి సందేశం పంపనున్నామని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు సాంకేతిక విద్యాశాఖలో సంస్కరణలకు పెద్దపీట వేస్తామన్నారు. 2010 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి నాగరాణి ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో సాంకేతిక విద్యాశాఖకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నగరంలోని సాంకేతిక విద్యా శాఖ కమీషనరేట్ లో నూతన సంచాలకులుగా బాధ్యతలు తీసుకున్న చదలవాడ పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించి అధికారులతో ఉన్నత స్దాయి సమీక్ష నిర్వహించారు. పాలిటెక్నిక్ ప్రవేశాల పరంగా అర్హత పొందిన విద్యార్ధుల వివరాలను ఆగస్టు 21వ తేదీన తమ అధికారిక వెబ్ సైట్ లో ఉంచుతామని, ఆగస్టు 25న క్లాసులు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసారు. రాష్ట్రంలో దాదాపు 70,000 వరకు పాలిటెక్నిక్ సీఃట్లు అందుబాటులో ఉండగా , 40, 000 మంది విద్యార్ధులు వెబ్ కౌన్సిలింగ్, అర్హతా పత్రాల ధృవీకరణకు హాజరయ్యారని నాగరాణి తెలిపారు. ఉపాధికి మార్గం చూపే విద్యాభ్యాసం దిశగా ప్రభుత్వం చేపట్టిన మార్పులకు అనుగుణంగా విద్యార్ధులలో నైపుణ్యతకు పెద్దపీట వేస్తామన్నారు. నాగరాణి ఇప్పటి వరకు చేనేత జౌళి శాఖ సంచాలకులుగా, ఆప్కో విసి, ఎండిగా, ఆంధ్రప్రదేశ్ ఖాదీ బోర్డు సిఇఓ గా వ్యవహరించారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణ స్దాయి పెంపొందించేలా ఆమె చేపట్టిన విభిన్న కార్యక్రమలు ప్రస్తుతం విజయవంతంగా అమలవుతున్నాయి. యువజనాభ్యుదయ శాఖ సంచాలకులుగా యువత ఉన్నతికి కృషి చేసారు. వాణిజ్య పన్నుల శాఖలోనూ తనదైన శైలిలో విధులు నిర్వర్తించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!