బుచ్చిరెడ్డిపాలెం,ఫిబ్రవరి 10 (ఆంధ్రపత్రిక):ఇదేమి కర్మ మా రాష్ట్రానికి కార్యక్రమం ఏడో వార్డు నాయకులు షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో కోవూరు ఇంచార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఖాజా నగర్ కాలనీలో సైడ్ కాలువలతో పాటు పలు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులుదగ్గర పడ్డాయి అన్నారు. టిడిపి ప్రభుత్వంలో ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు, కాలనీలలో మసీదులు కటించడం జరిగింది. ఈ ప్రభుత్వంలోప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి జరగలేదని నగర పంచాయతీ కమిషనర్ కూడా పట్టించుకోకుండా ఉండడం సరైన విధానం కాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెముకుల కృష్ణ చైతన్య,మండల నాయకులు ఎం.వి శేషయ్య, బత్తల హరికృష్ణ, ఇజాస్,షాకీర్ కాలేషా,నాయక్ దుగ్గిశెట్టి హరి,తాళ్ల స్వామి, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, మహేష్ నాయుడు,అతహర్ సర్దార్,షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!