నేడు థియేటర్లలో విడుదల
నవంబర్ 03 (ఆంధ్రపత్రిక): గ్లామరస్ రోల్స్‌తో ఇంప్రెస్ చేసే అను ఇమ్మాన్యుయేల్.. ’ఊర్వశివో, రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అల్లు శిరీష్ హీరోగా, రాకేష్‌శశి ఈ చిత్రాన్ని రూపొందించాడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, ఎం.విజయ్ నిర్మించారు. నేడు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా అను ఇలా ముచ్చటించింది. సింధు అనే సాప్ట్‌వేర్ అమ్మాయిగా నటించా. కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలనే తపనతో ఉండే క్యారెక్టర్. ఆమెకి ప్రేమ కావాలి. కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్ అనే సింపుల్ కుర్రాడు పరిచయం అవుతాడు. డిఫరెంట్ మైండ్ సెట్స్‌తో ఉండే సింధు, శ్రీ మధ్య నడిచే ప్రేమకథ హైలైట్‌గా నిలుస్తుంది. యూత్‌ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ కథను ఎంపిక చేసుకోవడానికి అరవింద్ గారు ముఖ్యకారణం. ’ఇలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. ట్రై చేయ్’ అని చెప్పడంతో ఓకే అన్నాను. పైగా గీతా ఆర్ట్స్‌లో సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. షూటింగ్ మొదలవకముందు.. శిరీష్, నేను ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. అందుకే స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య లవ్ సీన్స్, కెమిస్టీ, ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి. రాకేశ్ శశి డెడికేటింగ్ పర్సన్. అతనికి సినిమా తప్ప వేరే లోకం తెలీదు. ఇక నేను నటించిన సినిమాలు ఆడలేదేమో కానీ నటిగా ఫెయిల్ అనే మాట ఎక్కడా వినిపించలేదు. అనూ కళ్లతో అభినయించగలదు అనే మార్క్ సంపాదించుకున్నా. కొన్ని సినిమాల రిజల్ట్‌తో నన్ను నేను మార్చుకున్నా. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటున్నా. ఆ పాత్రకు నేను సూట్ అవుతాను అనుకుంటేనే ఓకే చేస్తున్నా. లేదంటే ఇంట్లో కూర్చుంటా. ఏదో వచ్చాం… చేశాం.. వెళ్లాం అనుకునే పద్దతిలో లేను. మంచి కథ ఎంచుకోవడం, పాత్రకు న్యాయం చేయడం వరకే నా చేతిలో ఉంది. సక్సెస్ నా చేతిలో లేదఇ వెల్లడంచింది.