అక్కడ దొరికిన రాయిని మీటర్ కు పెట్టగానే రాయి నాణ్యతను పాయింట్ల రూపంలో అది చూపిస్తుంది. కనీసం ఎనిమిది పాయింట్లు వస్తేనే అది వజ్రంగా గుర్తిస్తారని స్థానిక యువకుడు చెబుతున్నాడు. ఈ విషయం తెలియటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి వజ్రాలు వెదుకుతూ నాణ్యతను చెక్ చేయించుకుంటున్నారు.
సత్తెనపల్లి బసవమ్మ వాగు వద్ద వజ్రాలు దొరుకుతున్నాయని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. స్థానికులు పెద్ద సంఖ్యలో ఇక్కడ వజ్రాల వేట సాగిస్తున్నారు. అయితే తమకు దొరికింది వజ్రమా కాదా అన్న సంశయం స్థానికులను పట్టిపీడిస్తోంది. దీన్ని అధిగమించడాన్ని స్థానికులు వ్యాపారుల వద్దకు పరిగెడుతున్నారు. ఇది గమనించిన స్థానికుడు ఆన్ లైన్ లో డైమండ్ మీటర్ కొనుగోలు చేశాడు.
దాన్ని తీసుకొని బసవమ్మ వాగు వద్దకు వచ్చాడు. తాను వజ్రాల వేట సాగించాడు. అక్కడ దొరికిన రాయిని మీటర్ కు పెట్టగానే రాయి నాణ్యతను పాయింట్ల రూపంలో అది చూపిస్తుంది. కనీసం ఎనిమిది పాయింట్లు వస్తేనే అది వజ్రంగా గుర్తిస్తారని స్థానిక యువకుడు చెబుతున్నాడు. ఈ విషయం తెలియటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి వజ్రాలు వెదుకుతూ నాణ్యతను చెక్ చేయించుకుంటున్నారు.
బెల్లంకొండ నుండి కొండ మట్టిని బసవమ్మ వాగు వద్ద నున్న ఖాళీ స్థలంలో యజమానులు పోయించారు. దాన్ని మేరక కోసం చదును కూడా చేయించారు. ఇది. జరిగిన మూడు నెలల తర్వాత వర్షాలు పడటం ప్రారంభం అయ్యాయి. అయితే వర్షాలు పడటంతోనే రాళ్ళు మెరుస్తూ కనిపించాయి. రాళ్ళు మెరవటంపై స్థానికులు ఆ మట్టి బెల్లంకొండ పరిసర ప్రాంతాల నుండి తీసుకొచ్చినట్టు తేలింది. ఇంకేముంది అప్పటి నుండి స్థానికులు అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంటూ వెదకటం ప్రారంభించారు. వందల సంఖ్యలో స్థానికులు ఆ భూమిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మరికొంత మంది మాత్రం ఇదంతా వేలం వెర్రి అంటూ కొట్టివేస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి రోజూ పదుల సంఖ్యలో స్థానికులు ఆ భూమిలో వెదుకులాట కొనసాగిస్తూనే ఉన్నారు.