నవంబర్ 24 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రం ధమ్కీ. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటిస్తున్నాడు. ధమ్కీ ఫిబ్రవరి 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తాజాగా విశ్వక్ సేన్ టీం విడుదల తేదీ కూడా ప్రకటించేసింది. ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. భమ్ భోలేనాథ్ శివరాత్రి 2023కి విూ ముందుకు వస్తున్నాడు..అంటూ జీన్స్, సూట్లో చేతిలో కర్రపట్టుకున్న పోస్టర్ను షేర్ చేస్తూ విడుదల తేదీ అప్డేట్ అందించాడు విశ్వక్సేన్. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ కథనందిస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!