డిసెంబర్ 09 (ఆధ్రపత్రిక): రవితేజ సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్ కంపల్సరీ. ’ధమాకా’ చిత్రంలో ఈ డోస్ ఇంకాస్త ఎక్కువ ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన పాటలు ప్రూవ్ చేశాయి. గురువారం ఐదో పాటను విడుదల చేశారు. ’దండ కడియాల్ దస్తి రుమాల్.. మస్తుగున్నోడంటివే పిల్లో’ అంటూ సాగే పాట పూర్తిస్థాయి మాస్ నంబర్‌గా ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో ఈ పాటను రాసి, మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాకుండా తనే పాడాడు. భీమ్స్ తో కలిసి సాహితీ చాగంటి, మంగ్లీ గొంతు కలిపారు. ’కిరుకిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో’ అని హీరో అంటుంటే.. ’గజ్జెల పట్టీలిస్తివో, గాజులిచ్చి బుట్టలో వేస్తివో, ముక్కెర నువ్వై పూస్తివో, నీ ముద్దుల ముద్దరలేస్తివో, సందడివోలే వస్తివో.. సోకుల అంగడి తీసుకు పోతివో’ అంటూ హీరోయిన్ బదులిస్తోంది. ఇప్పటికే ’జింతాక్’ పాటతో ఇంప్రెస్ చేసిన భీమ్స్.. ఈ పాటతో మరోసారి మాస్ అండ్ ఫోక్ నంబర్స్‌ని కంపోజ్ చేయడంలో తన మార్క్ చూపించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ, శ్రీలీల చేసిన డ్యాన్స్ ఎనర్జిటిక్‌గా ఉంది. కలర్ ఫుల్‌గా వేసిన స్పెషల్ సెట్లో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్. ఈనెల 23న సినిమా విడుదల కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!