ప్రమాదాలు నివారించాలని…
నైట్ గస్తీ ముమ్మరం చేయాలని…
గంజా రవాణాపై దృష్టి సారించాలని…
అనేక విషయాలపై రివ్యూ మీటింగ్ లో చర్చించారు…
విశాఖపట్నం, అక్టోబర్ 12 (ఆంధ్రపత్రిక):
కే.వి.రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం సాయంత్రం నగరానికి విచ్చేసి విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ. రవి శంకర్, తో పాటుగా నాలుగు జిల్లాలైన ఆనకాపల్లి , మన్యం, విజయనగరం ,శ్రీకాకుళం ఎస్.పి లతో పోలీస్ గెస్ట్ హౌస్ నందు గల సమావేశమందిరంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ప్రయారిటీ కేసుల నందు కోర్టులో ట్రయిల్ కు వచ్చి కన్విక్షన్ పడే వరకూ పూర్తి మోనటరింగ్ చేయాలని, ప్రతీ ఉన్నతాధికారి 5 కేసులు మోనటరింగ్ చేయాలని ,కేసుల విషయం లో క్రమం తప్పకుండా స్టేషన్ ఇన్స్పెక్టర్ల తో మాట్లాడుతూ ఉండాలని, ఎక్కువ కేసులు గల రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ పై నిరంతరం దృష్టి పెట్టాలని తెలిపారు, ప్రతీ నెలా కన్విక్షన్ పడుతున్న కేసుల సంఖ్య మునుపటి నెలతో పోల్చినప్పుడు పెరుగుదల కనిపించాలని తెలిపారు .
ఉమెన్ సేఫ్టీ కు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళల పైన వేదింపులు, మహిళల మిస్సింగ్ సంబంధిత కేసులలో జాప్యం లేకుండా తక్షణమే స్పందించి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో వారితో వ్యవహరించాలన్నారు. పొక్సో కేసుల పైన ఆరా తీశారు.
రోడ్డు ప్రమాదాల నందు మరణాలు, గాయాలకు గురికావడం పూర్తిగా తగ్గేలా, మరణాల శాతం తగ్గేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గంజా రవాణా కు పూర్తి అడ్డుకట్టకు తగు చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వాటి ఫార్వార్డ్ బ్యాక్ వార్డ్ లింక్ లను చివరివరకూ ఎంక్వయిరీ చేయాలనీ తెలిపారు.
క్రైమ్ రేటు తగ్గు ముఖం పట్టేలా రాత్రి పూట నిఘా మరింత పటిష్టం చేయాలనీ తెలిపారు, రాత్రి విధులు నిర్వహించే ప్రతీ ఒక్కరూ ట్యాబ్ తీసుకొని,తమ లొకేషన్ తెలిసే విధముగా ఉండాలని తెలిపారు.
SEB టీంలుగా ఏర్పడి నగరంలో వున్న విద్యాసంస్థలు వద్ద నిఘా ఉండేలా ప్రముఖ ప్రాంతాల్లో డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలపై బ్యానర్స్ ఏర్పాటు చేయాలి అని తెలిపారు.
సైబర్ క్రైమ్ పై మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించారు, పలు కొత్త సాఫ్ట్ వేర్ లను తీసుకొని వినియోగించాలని సూచించారు.
లోక్ ఆధాలత్ నందు గతంలో కంటే మరిన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పెండింగ్లో ఉన్న కేసులు యొక్క వివరాలు, కేసు పెండింగ్ ఉండడానికి గల కారణాలు తెలుసుకొని సదరు పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించివలసిందిగా ఆదేశించారు, క్రైమ్, ట్రాఫిక్ విభాగాల పనితీరు సమీక్షించారు, కోర్టు తీర్పు వెలువరించిన కేసుల వివరాలు తెలుసుకున్నారు.