ఐటి విద్యార్థులకు ఉపాధి కల్పించే లక్ష్యం
గ్లోబల్ టెక్ సమ్మిట్‌లో మంత్రి గుడివాడ
విశాఖపట్నం,ఫిబ్రవరి16(ఆంధ్రపత్రిక): రాబోయే రోజుల్లో విశాఖను ఐటి డేసిటీనేషన్గా రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. ఎపిలో సుమారు 300 పైగా ఇంజనీరింగ్ కళాశాల నుండి ప్రతి ఏడాది వేల సంఖ్య లో విద్యార్థులు రిలీవ్ అవుతున్నారని వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతయినా ఉందని అన్నారు. అమెరికాలో ఉన్న ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగులలో ఒకరు తెలుగు సంతతికి చెందిన వారని కావున మన రాష్ట్రంలోనే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనదేశం కూడా ప్రపంచ దేశాలలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అద్వర్యం జి`20 సమావేశాలకు సన్నహకల్లో భాగంగా పల్సస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ టెక్ సమ్మిట్`2023 విశాఖపట్నం లోని విఎంఆర్డీఏ చిల్డన్ర్ ఏరినాలో ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ పల్సస్ సంస్థ నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో విశాఖను ఐటి డేసిటీనేషన్గా రూపొందించే క్రమంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సుమారు 500`600 ఎకరాల్లో అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలో ఐటీ పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలిపారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో ఆదాని డేటా సెంటర్‌తో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లకు శంకుస్థాపన జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో రాజధాని కానున్న సందర్భంగా ఈ నగరాన్ని ఐటీ రంగం లో అభివద్ధి చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఇప్పటికే నగరంలో పల్సస్, రాండ్ స్టాండ్, డబ్ల్యూఎన్ఎస్, వంటి సంస్థలు వేల కొద్దీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నయని త్వరలోనే ఇన్ఫోసిస్ కూడా నగరంలో తమ కార్యకలాపాలు ప్రాంభించనుందని తెలిపారు. నంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శిశు సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అత్యవసర సమయాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిమోట్ మోనిటరింగ్ ద్వారా వైద్య అందించే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. టెలీ మెడిసిన్ అన్నది కోవిడ్ కాలంలో ఎంతో వృద్ధి చెందిందని రాష్ట్రంలో ప్రతి రోజు 66 వేల మందికి టెలి కన్సల్టేషన్ అందిస్తున్నామని ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో సులభమైన ఆరోగ్యం అందుతుందని ఆమె అన్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పివిజిడి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది విదేశీ విద్యార్థులు పాల్గొన్నారని, 72 ఐటీ సంస్థల సహకారం తో త్వరలోనే ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకుబేషన్ సెంటర్ ప్రాంభించనున్నామని తెలిపారు. ఇప్పటికే 27 కోట్ల ప్రభుత్వ నిధులతో 18 స్టార్ట్ప్ లు నెలకొల్పమని తెలిపారు. అనంతరం నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా మరియు యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి ఎంఓయు ఎక్సేంజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఆందప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర, సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి కమాండర్ అమిత్ రస్తోగి, ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ టి.వి.నారాయణ, యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపల్ కన్‌స్టలెంట్ అడా డైనండో, బ్రిటిష్ హై కమిషనర్ ప్రజ్ఞా చతుర్వేది, పల్సస్ సీఈఓ గేదెలు శ్రీను బాబు, ప్రముఖ ఐటీ సంస్థల అధినేతలు ఓం ప్రకాష్ నక్క, ప్రొఫెసర్ ప్రదీప్ శ్రీవాస్తవ్, డాక్టర్ నవ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!