- మాకు రాష్ట్ర అభివృద్ది, ప్రజల సంక్షేమం ముఖ్యం
- రాజకీయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు
- ఎపి పునర్నిర్మాణానికి చేయూతను ఇవ్వండి
- విశాఖ సభలో సిఎం జగన్ వినతి
విశాఖపట్టణం,నవంబర్ 12 (ఆంధ్రపత్రిక): ఏపీ అభివృద్ధికి మోడీ ఆశీస్సులు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏయూ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టాభ్రివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇంకాస్త సాయం చేయాలని జగన్ కోరారు. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీతో తమకున్న అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు. అన్నారు. ఏపీకి ఇచ్చిన హావిూలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని జగన్.. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని ఉండబోదని జగన్ తేల్చి చెప్పారు. రాష్టాభ్రివృద్ధి, శ్రేయస్సు కోసం విభజన హావిూలతో పాటు.. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పరిష్కరించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు అవసరమని ఎల్లవేళలా కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న సీఎం.. గడిచిన మూడున్నరేళ్లల్లో విద్య, వైద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, పారదర్శకత, గడప వద్దకే పరిపాలనే తమ ప్రాధాన్యతలుగా అడుగులు వేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మ విశ్వాసంతో జీవించే పరిస్థితి కల్పించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి ముందుకు నడిపించాలని జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఏయూ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టాభ్రివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇంకాస్త సాయం చేయాలని జగన్ కోరారు. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీతో తమకున్న అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు. అన్నారు. ఏపీకి ఇచ్చిన హావిూలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని జగన్.. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని ఉండబోదని జగన్ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న సీఎం.. గడిచిన మూడున్నరేళ్లల్లో విద్య, వైద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, పారదర్శకత, గడప వద్దకే పరిపాలనే తమ ప్రాధాన్యతలుగా అడుగులు వేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మ విశ్వాసంతో జీవించే పరిస్థితి కల్పించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి ముందుకు నడిపించాలని జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.దేశ ప్రగతికి ప్రధాని మోడీ రథ సారథి అని వైఎస్ జగన్ అన్నారు. విశాఖపట్నంలో జనసముద్రం కనిపిస్తుందన్నారు. విభజన గాయాల నుంచి ఏపీ పూర్తిగా కోలుకోలేదని.. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ప్రతి పనిని ఇక్కడ ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం అని తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాల తప్ప మరొక అజెండా ఉండదన్నారు. గడిచిన మూడున్నరేళ్లల్లో విద్య, వైద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, పారదర్శకత, గడప వద్దకే పరిపాలనే తమ ప్రాధాన్యతలుగా అడుగులు వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మ విశ్వాసంతో జీవించే పరిస్థితి కల్పించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి ముందుకు నడిపించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. రూ.10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ధన్యావాదాలు తెలిపారు. విభజన హావిూల నుంచి ప్రత్యేక హౌదా, రైల్వే జోన్, పోలవరం, స్టీల్ ఇలా పలు సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పెద్దమనుసుతో వాటిని పరిష్కారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా చెప్పారు.