విజయవాడ, సెప్టెంబర్ 30 (ఆంధ్రపత్రిక): రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గాంధీ నాగరాజన్ చెప్పారు. శుక్రవారం ఊర్మిళానగర్‌లోని ట్రస్ట్ కార్యాలయం వద్ద ట్రస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బాపటి భారతి కార్యనిర్వహణలో ముఖ్య మహిళా అధ్యక్షురాలు ఆర్.ఎన్.సొరంజని సహాయ సహకారంతో ఆయన ప్రత్యేక హోదా సాధన కోసం కళ్ళకు గంతలు కట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా నాగరాజన్ విలేకరులతో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జనవరి 30వ తేదీన హత్యకు గురై మృతి చెందారని, అందుకే ప్రతినెల 30వ తేదీన తాను శాంతియుతంగా గాంధీజీ ఆశయ సాధన కోసం ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు శాంతియుతంగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతుండటం, గాంధీని హత్య చేసిన గాడ్సేకు కొన్ని రాజకీయ పార్టీలు నీరాజనాలు పలకడం ఆందోళనకరమని ఆయన విమర్శించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!