కె.కోటపాడు, జనవరి 8 (ఆంధ్రపత్రిక) : మండలంలో చౌడువాడ పంచాయతీ పరిధి గ్రామాల్లో ఆది వారం ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు రెండు రక్షితనీటి పథకాలను ప్రారంభించారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా త్రాగునీటి సరఫరా నిమిత్తం గరుగుబిల్లి గ్రామం బంటువారి కల్లాలలో రూ.19లక్షల వ్యయంతో నిర్మించిన 10 వేలలీటర్లసామర్ధ్యం గలరక్షిత నీటి పధకాన్ని ప్రారంభించారు.అలాగే సిరికివారి కల్లాలో రూ.19 లక్షల ఖర్చుతో నిర్మించిన పదివేల లీటర్ల కెపాసిటీగల రక్షితనీటి పధకాన్ని మంత్రి ముత్యాల నాయుడు ప్రారంభించారు.జల జీవన్ మిషన్, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.38 లక్షల వ్యయంతో రెండు నీటి పథకాలను నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఎంపిటిసి సభ్యులు ఏటుకూరి రాజేష్, అర్.డబ్ల్యూ.ఎస్.ఎస్. డీఈఈ అల్లు సూర్యనారాయణ, ఏఈఈ అల్లు శ్వేత, ఈఒపిఆర్డి ప్రసాద్, విశాఖ డెయిరీ డైరెక్టర్ సుందరపు గంగాధర్, వైసిపి నాయకులు దాట్ల శివాజీరాజు, లెక్కల గోపి తది తరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!