ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన ఆపదలో ఉన్నామని తమను ఆదుకోవాలని వచ్చిన వారిని చేరదీస్తున్నారు.
అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఏ సమస్య వచ్చినా.. తన దృష్టికి వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా పాలనలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. పవన్ పాలన చూసి జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు 7 నెలల తర్వాత జీతం అందుకున్నారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు.ఈ విషయం పవన్ దృష్టికి రావడంతో రూ.30కోట్ల నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.