కె.కోటపాడు,ఫిబ్రవరి06(ఆంధ్రపత్రిక):
మండలంలోని చౌడువాడ గ్రామ సచివాలయం పరిధి చౌడువాడ, గరుగుబిల్లి గ్రామాల్లో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. ప్రజలు ఘనస్వాగతం పలికారు. మంత్రిపై పూలవర్షం కురిపించారు. దివంగత నేత వైస్సార్ విగ్రహానికి మంత్రి పూల మాలవేశారు. రోజంతా వాడ వాడలా గడప గడపను సందర్శించారు. గ్రామంలో వందలాదిమంది లబ్ధిదారులకు కోట్ల రూపాయలలో సంక్షేమపధకాల ద్వారా లబ్ధిచేకూరిందని మంత్రి అన్నారు. మును పెన్నడూ లేనివిధంగా రూ.4.68 కోట్లతో1400 ఇళ్లకు కుళాయిలు ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు.
భవిష్యత్ లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు చూపుతో బావి ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.వారితో మంత్రి ముచ్చటించారు. ఏ జీవనాధారం లేని మహిళకు నెలనెలా తమ సొంత నగదుతో పింఛను అందిస్తానని హామీ ఇచ్చారు. ఎలిమెంటరీ స్కూల్ లో నాడు-నేడులో రూ.18.43 లక్షలతో అధునీకరించిన పనులను మంత్రి ప్రారంభించారు.పాఠశాలలో చదువుతున్న చిన్నారి కుసుమ(8) తల్సీమియా వ్యాధితోబాధ పడుతున్నందున 10 వేల రూపాయల పింఛన్ మంజూరు చేశారు. గ్రామంలో సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ సౌకర్యంసరిగా లేని కాలనీవారి సమస్య త్వరిత గతిన పరిష్కరించాలని డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు అధికారులనుఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్ మోహన్, జడ్పిటిసి సభ్యురాలు ఈర్లె అనురాధ, తహసీల్దార్ జె.రమేష్ బాబు, ఎంపీడీఓ డాక్టరు శచీదేవి, పలు శాఖల గ్రామ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.