పెరుగుతున్న కేసులతో ఆందోళన
న్యూఢల్లీి,అక్టోబర్ 10: దేశ రాజధాని ఢల్లీిలో డెంగీ ఫీవర్ విజృంభిస్తున్నది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఢల్లీి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 321 మందికి డెంగీ ఫీవర్ సోకింది. సెప్టెంబర్ నెలలో కూడా ఢల్లీిలో డెంగీ కేసులు భారీగానే నమోద య్యాయి. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 693 మంది డెంగీ బారినపడ్డారు. ఢల్లీిలో ఈ ఏడాది జనవరి నుంచి నెలకు 20, 25 చొప్పున కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ ఆగస్టులో ఉన్నట్టుండి 75 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్లో ఏకంగా 693 మందికి డెంగీ వచ్చింది. ఈ నెలలో మొదటి ఐదు రోజుల్లోనే 321 కేసులు రికార్డయ్యాయి. నెలాఖరు వరకు మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నది. కాగా, ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు మొత్తం 1258 మందికి డెంగీ ఫీవర్ సోకింది. అయితే డెంగీ బారినపడిన బాధితులంతా కోలు కుంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం సంతోషకరమైన పరిణామం.