భారతరత్న ఇవ్వాలన్న విషయం పక్కదారి
తెలంగాణలో పివిని విస్మరిస్తున్న బిజెపి
హైదరాబాద్,ఏప్రిల్27(ఆంధ్రపత్రిక): మాజీప్రధాని పి.వి. నరసింహారావుకు భారతరత్న ప్రదానం చేయాలన్న సంకల్పాన్ని బిజెపి పట్టించుకోవడం లేదు. సచిన్ టెండుల్కర్, లతా మంగేష్కర్ కన్నా పివి లోకువయ్యాడా అన్న విమర్శలు వస్తున్నాయి. పివికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ, తెలంగాణ శాసనసభ గతంలోనే తీర్మానం చేసినా బిజెపి పెద్దగగా పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్న బిజెపి ఇప్పటికైనా పివికి గౌరవం దక్కించాలి. దేశంలో ఊరూపేరు లేని వారికి భారతరత్నలు వచ్చాయి. అయినా పివికి మాత్రం గుర్తింపు రావడం లేదు. మోడీ అధికారం చేపట్టి 9 ఏళ్లు దాటినా ఆయన సేవలను గుర్తించడం లేదు. రాజకీయ కోణంలో ప్రణబ్ ముఖర్జీకి ఆయన బతికుండగానే భారతరత్న అందించారు. పివికి మాత్రం ఆ ఖ్యాతి దక్కడం లేదు. పి.వి. నిర్వహించిన పాత్రకు, మొత్తంగా సుదీర్ఘమైన రాజకీయ జీవితానికి, వ్యక్తిగతంగా ఆయనలోని పాండిత్యానికి? ఎన్ని బిరుదాలనైనా ఇవ్వవచ్చు. భారతరత్నకు ఆయన అర్హుడు కారని ఎవరూ అనలేరు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పివి సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలు చేసింది. తొలిదశ తెలంగాణ ఉద్యమం అనంతరం, నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన పి.వి. నరసింహారావు, బలమైన జై ఆంధ్ర ఉద్యమం కారణంగా కొద్దికాలానికే రాజీనామా చేయవలసి వచ్చింది. ఉన్న కొద్దికాలంలో చేసిన భూసంస్కరణల కారణంగా కూడా ఆయనకు రాజకీయ శత్రువులు పెరిగిపోయారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక, ఆయన కార్యస్థానం దేశ రాజధానికి మారిపోయింది. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉండగా పివికి గుర్తింపు తీసుకుని వస్తామని అన్నారు. కానీ జరగలేదు. అలా పి.వి. నరసింహారావు స్మృతిని కైవసం చేసుకోవడానికి బిజెపి కూడా ప్రయత్నించింది. సర్దార్ పటేల్‌ను కాంగ్రెస్ చరిత్ర నుంచి తప్పించి, తమ ఖాతాలోకి విజయవంతంగా మళ్లించగలిగిన బిజెపికి, నరసింహారావు కూడా ఒక లక్ష్యం అయ్యారు. ఆయన హయాంలోనే బాబ్రీ మసీదు విధ్వంసం జరగడం, ఆర్థిక సంస్కరణలు అమలు జరపడం, మితవాద రాజకీయాలపై పెద్దగా వ్యతిరేకత లేదన్న అభిప్రాయం ప్రచారంలో ఉండడం?ఇవన్నీ పి.వి.ని అభిమానించ డానికి బిజెపికి కారణాలయ్యాయి. భారతీయ జనతాపార్టీకి తెలంగాణ విషయంలో ఆసక్తి, అవకాశాలూ ఉన్నాయి. తెలంగాణలో కాలు మోపాలని చూస్తున్న బిజెపి పివికి భారతరత్నపై నోరు మెదపాలి. ఇప్పుడు
తెలంగాణలో చరిత్రను తమ ఖాతాలోకి మళ్లించు కోవడానికి బిజెపి ప్రయత్నిస్తున్నది. బిజెపి నేతలు చేస్తున్న పర్యటనలు, దర్శిస్తున్న ప్రాంతాలు అంతా కూడా రాజకీయ లబ్దికోసమే తప్ప మరోటికాదు. పి.వి. నరసింహారావును తమ చరిత్రలో భాగం చేసుకోవడం ద్వారా కెసిఆర్ ఓ మంచిపనిచేశారు. బిజెపి భారతరత్న ఇచ్చివుంటే తెలంగాణలో ఆ పార్టీకి మంచి ఫలితం ఉంటుంది.ఇటీవలే పి.వి. నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పి.వి. పేరు పెట్టాలని కూడా తీర్మానంలో కోరారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!