శనివారం ఉదయం ఢిల్లీలోని తాజా పరిస్థితికి గురించి సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) రిలీజ్ చేసిన డేటా ప్రకారం, శనివారం ఉదయం 6 గంటలకు దేశ రాజధాని AQI 339 వద్ద ఉంది. ప్రస్తుతం, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) లోని IV దశ దేశ రాజధానిలో అమలు చేయబడింది.
వరుణుడి కరుణతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధాని.. వర్షంతో కొంచెం ఉపశమనం లభించింది. అయితే ఈ కాలుష్యానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కృత్రిమ వానలు కురిపిస్తానంటోంది ఢిల్లీ సర్కార్. ఎన్నడూ లేనంత వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ.. ఓ మోస్తరు వానతో ఊపిరి పీల్చుకుంది. కాలుష్యం కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న ఢిల్లీ వాసులకు స్వల్ప ఊరట లభించింది. వర్షం ధాటికి కాలుష్యం కాస్త తగ్గి గాలి నాణ్యత మెరుగు పడింది. పశ్చిమ గాలులు దిశ మార్చుకోవడంతో వాయవ్య భారతంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ 408కి తగ్గింది.అంతకుముందు ఇది 437గా నమోదైంది. శనివారం ఉదయం ఢిల్లీలోని తాజా పరిస్థితికి గురించి సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) రిలీజ్ చేసిన డేటా ప్రకారం, శనివారం ఉదయం 6 గంటలకు దేశ రాజధాని AQI 339 వద్ద ఉంది. ప్రస్తుతం, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) లోని IV దశ దేశ రాజధానిలో అమలు చేయబడింది.
ఇవాళ కూడా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వర్షం కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దీపావళి రోజున ఢిల్లీలో కాలుష్యం మరింత తగ్గే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీలో గత వారం రోజులుగా వాయు నాణ్యత విపరీతంగా క్షీణించి ప్రమాదకర స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ అంతటిని విషపూరిత పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడమే ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టిన ఢిల్లీ ప్రభుత్వం.. ఈ నెల 20న కృత్రిమ వర్షం కురిపించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. కృత్రిమ వర్షాలతో వాయు కాలుష్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐఐటీ కాన్పూర్‌తో కలిసి మేఘమథనం జరిపే అంశాన్ని కేంద్రం దృష్టికి ఢిల్లీ సర్కార్ తీసుకువెళ్లింది.
అయితే ఈలోగానే వర్షాలు కురుస్తుండడం దేశ రాజధాని వాసులకు ఊరట ఇచ్చింది. వాయు కాలుష్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని తలలు పట్టుకుంటున్న ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ వర్షంతో ఉపశమనం కలిగినట్లయింది.