ముంబై,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): రుణ వసూళ్ల ఏజెంట్ల ఆగడాలకు చెక్ పడనుంది. దీనికి సంబంధించి ఆర్బీఐ మరోమారు మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఘాటుగా హెచ్చరించారు కూడా. తాజాగా ఏజెంట్ల ఆగడాలకు బ్యాంకులు, ఆయా ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రుణ వసూళ్ల ఆగడాలు మితివిూరి పోతున్నాయని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ఫిన్టెక్ కంపెనీలు యాప్ల ద్వారా వారికి అప్పులిచ్చి, ఏజెంట్ల సాయంతో పెద్ద ఎత్తున ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిన్టెక్ కంపెనీల్లో కొన్ని చైనా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ద్రవ్య, పరపతి విధాన సవిూక్షలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ఏజెంట్ల ఆగడాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏజెంట్లకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసింది. కాయిల వసూలు కోసం ఏజెంట్లు ఎలాంటి బెదిరింపులు, వేధింపులకు పాల్పడ కూడదు. అందరి ముందు రుణగ్రస్తులను అవమానించరాదు. రుణగ్రస్తుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, మధ్యవర్తుల గోప్యతను దెబ్బతీసేలా వారి ఫోన్లు లేదా సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి మెసేజీలు, పోస్టు లు పెట్టకూడదు. ఏజెంట్లు రుణగ్రస్తుల ఫోన్లకు ఉదయం ఎనిమిదింటి లోపు, సాయంత్రం ఏడిరటి తర్వాత ఎలాంటి ఫోన్ కాల్స్ చేయకూడదు వంటి ఆదేశాలు
ఇచ్చారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!