రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాల అంశం గురించి శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాన్ని నిపుణుల కమిటీ పరిశీలించాలని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అఖిల పక్ష భేటీలో దీన్ని చర్చించాలని ఆయన అన్నారు. అయితే ఇవాళ తొలిసారి జరిగిన లైవ్ స్ట్రీమిగ్లో ఈ కేసును విచారించారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు ఇస్తున్నాయని, ఆ పార్టీల గుర్తింపు ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రజాస్వామ్యంలో అసలైన శక్తి ఓటరు వద్దే ఉంటుందని, వాళ్లే పార్టీలను, అభ్యర్థులను ఎంపిక చేస్తారని సీజే రమణ అన్నారు. అయితే ఈ అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీజే అన్నారు. ఈ అంశంపై ఆల్ పార్టీ విూటింగ్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు సీజే గుర్తు చేశారు.తాము చేస్తున్న వాగ్దానాలు ఉచితాలు కాదు అని, అవి సంక్షేమ పథకాలు అని అనేక రాజకీయ పార్టీలు కోర్టులో వాదించాయి. అయితే ఇలాంటి కేసుకు సంబంధించిన 2013 నాటి తీర్పును పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. ఉచితాల అంశంలోని సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!