WTC Final 2023: భారత్‌తో పంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ఎంపికైన డేవిడ్ వార్నర్.. 2011లో ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గత 12 ఏళ్లలో 103 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా రిటైర్మెంట్ చేస్తున్నట్లు ప్రకటించి, ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు.
WTC Final 2023, IND vs AUS: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానుంది. అందరి చూపు ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఈ కీలక మ్యాచ్‌కి ముందే ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. టైటిల్ మ్యాచ్‌కు ముందు, వార్నర్ టెస్ట్ క్రికెట్లో తన భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పెట్టనున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు వార్నర్ సిద్ధమయ్యాడు. WTC ఫైనల్‌కు ముందు ఈ విషయాన్ని ప్రకటించాడు.
గత కొన్ని నెలలుగా బ్యాడ్ ఫాంతో పోరాడుతోన్న వార్నర్.. టెస్ట్ కెరీర్ ఇటీవల వారాల్లో చర్చనీయాంశమైంది. భారత్‌తో జరిగే కీలక ఫైనల్‌కు, ఆపై ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయాలా వద్దా అనే చర్చ కూడా క్రికెట్ ఆస్ట్రేలియాలో జరిగింది.
రిటైర్మెంట్ డేట్ ఫిక్స్..
ఈ రెండు మ్యాచ్‌లకు వార్నర్‌కు చోటు దక్కింది. అయితే ఆస్ట్రేలియా సెలక్టర్ల దృష్టిలో వార్నర్ ఆటతీరుపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయం చెప్పకనే చెప్పారు. ఇక ఈ ఫార్మాట్లో ఎక్కువ కాలం ఉండబోనని వార్నర్ స్వయంగా స్పష్టం చేశాడు. cricket.com.au తో మాట్లాడుతూ ఎడమ చేతి వాటం ఓపెనర్ తన ప్రణాళికలను వెల్లడించాడు. జనవరి 2024లో సిడ్నీలో పాకిస్తాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌తో ఈ ఫార్మాట్లో తన కెరీర్‌ను ముగించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ జట్టు డిసెంబర్-జనవరి 2024లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉంటుంది. అక్కడ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. సిడ్నీ వార్నర్‌కు సొంత మైదానం.
అయితే సిడ్నీలో చివరి టెస్టు ఆడాలంటే.. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో పరుగులు చేసి, ఆపై యాషెస్‌లో సత్తా చాటాల్సి ఉంటుందని, ఆ తర్వాతే పాకిస్థాన్ టెస్టు సిరీస్‌కు ఎంపిక సాధ్యమవుతుందని వార్నర్ అంగీకరించాడు. కానీ పాక్ సిరీస్ ముగిసిన వెంటనే జరిగే వెస్టిండీస్ సిరీస్‌లో కూడా ఆడబోనని స్పష్టం చేశాడు.
ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు..
ఇది మాత్రమే కాదు, వార్నర్ మరోసారి తన పాత పాయింట్‌ను పునరావృతం చేశాడు. 36 ఏళ్ల తుఫాన్ బ్యాట్స్‌మెన్ టెస్టుల తర్వాత కూడా వన్డే, టీ20 క్రికెట్లో కొనసాగుతానని, అయితే 2024 టీ20 ప్రపంచకప్ తన కెరీర్లో చివరి టోర్నీ అని, ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశాడు.
వార్నర్ 2011లో ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు . అప్పటి నుంచి అతను నిరంతరంగా జట్టు ఓపెనర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ 12 ఏళ్లలో ఆస్ట్రేలియా తరపున వార్నర్ 103 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో కూడా నిషేధం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 8158 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి.