విజయవాడ సెంట్రల్, సెప్టెంబరు 30, (ఆంధ్రపత్రిక):- శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజైన నిజ ఆశయుజ శుద్ధ షష్టి శనివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తుంది. జగజ్జననీ అయిన శ్రీమహాలక్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భక్తులను సాక్షాత్కరిస్తుంది. యాదేవీ సర్వభూతేషు సంస్థితా.. అంటే సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి… అని చండీ సప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళకారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుంది. శ్రీమహాలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చే కనకదుర్గమ్మకు ఈ రోజున నైవేద్యంగా పంచభోగాలైన పాయసం, చక్రపొంగలి, లడ్డూ, పులిహోర, దద్దోజనాలను నివేదిస్తారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!