అమరావతి,డిసెంబర్ 6 (ఆంధ్రపత్రిక): ఆగ్నే య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీ డన ద్రోణి మరింత బలపడినట్టు భారత వాతా వరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ సాయంత్రానికి ఇది క్రమంగా వాయు గుండంగా మారే సూచనలు ఉన్నట్టు వెల్లడిర చింది.వాయువ్య దిశగా కదులుతూ కోస్తాంధ్ర-తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తూ మరింత బలపడి 8వ తేదీ ఉదయానికి తుపానుగా మరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర-తమిళనాడు తీరాలకు దగ్గరగా తుపానుగా మారిన అనంతరం తీవ్ర ప్రభావం చూపే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది.వాయుగుండం ప్రభావంతో 7వ తేదీ సాయంత్రం నుంచి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే 8 నుంచి 10వ తేదీ వరకు దక్షిణ కోస్తా, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారమున్నట్టు ఐఎండీ వెల్లడిరచింది. 7 నుంచి 10వ తేదీ వరకు మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తీర ప్రాంతాల్లోని రెవెన్యూ యంత్రాంగాన్ని ఏపీ విపత్తు నిర్వహణసంస్థ అప్రమత్తం చేసింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!