బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. మిచౌంగ్ తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. భారీ వర్షాలు కూడా కురవనున్నాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హంసలదీవి బీచ్ గేట్లు మూసి వేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. మిచౌంగ్ తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. భారీ వర్షాలు కూడా కురవనున్నాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హంసలదీవి బీచ్ గేట్లు మూసి వేశారు.. అటు బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా అటు నెల్లూరులోనూ రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. ఈ వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటితో రోడ్లు, మురుగు కాలువలు చెరువులను తలపించాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రేపు తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని, 5వతేదీ ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అటు ఏపీ అంతటా భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు.