మరో గండం తరుముకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో తుపానుగా మారి నెల్లూరు తీరం వైపు దూసుకువస్తోంది. ఓ వైపు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మిచాంగ్’ తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయి. తుఫాన్ మరింత బలపడుతోంది.
మరో గండం తరుముకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో తుపానుగా మారి నెల్లూరు తీరం వైపు దూసుకువస్తోంది. ఓ వైపు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మిచాంగ్’ తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయి. తుఫాన్ మరింత బలపడుతోంది. పరిణామలు చూస్తంటే ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారు.
మిచాంగ్’ తుఫాను నేపధ్యంలో అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులపై సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తరుఫున అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. సాధ్యమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు.
బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా డిసెంబర్ 3, డిసెంబర్ 4 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ‘మిచాంగ్’ కారణంగా డిసెంబర్ 4న గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా తీర ప్రాంతాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ‘మిచాంగ్’ తుఫాను దృష్ట్యా అన్ని కళాశాలలకు డిసెంబర్ 4వ తేదీన సెలవు ప్రకటించారు.
మిచాంగ్ ‘తుఫాను’ కారణంగా, రైల్వే అనేక రైళ్లను రద్దు చేసింది. తుఫాను కారణంగా రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే తన ట్వీట్‌లో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో రానున్న ‘మిచాంగ్’ తుఫాను దృష్ట్యా, భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికార ప్రతినిధి ప్రకటించారు. రాబోయే తుఫాను ‘మిచాంగ్’ దృష్ట్యా, నార్త్ వెస్ట్రన్ రైల్వేలో నడుస్తున్న రైలు సర్వీసులు రద్దు చేయడం జరిగింది.
రద్దు చేయబడిన రైళ్లు ఇవేః
1. రైలు నంబర్ 12968, జైపూర్ – చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ రద్దు 2. రైలు నంబర్ 12967, చెన్నై – జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ రద్దు. 3. రైలు నంబర్ 22674, మన్నార్గుడి – భగత్ కి కోఠి ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ రద్దు. 4. రైలు నంబర్ 22673, భగత్ కి కోఠి – మన్నార్గుడి ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ రద్దు.
మిచాంగ్’ తుపాను దృష్ట్యా అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగమేనని అధికారిక వర్గాలు తెలిపాయి. IMD అంచనాను దృష్టిలో ఉంచుకుని పరిపాలన అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో తుపానుగా మారి నెల్లూరు-ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటనుంది. తుపాను గరిష్ఠ వేగం గంటకు 80-90 కి.మీ నుంచి 100 కి.మీల మధ్య మచిలీపట్నంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. జిల్లాలోని 25 డివిజన్లలో ఏడింటిలో తుపాను ప్రభావం కనిపించనుంది.
వాతావరణ శాఖ సూచనల మేరకు 63 గ్రామాలలోని మత్స్యకారులు డిసెంబర్ 1 నుండి 6 వరకు ఆరు రోజుల పాటు సముద్రం, నది బ్యాక్ వాటర్‌లోకి వెళ్లవద్దని కోరారు. జిల్లాలో 3.74 లక్షల ఎకరాల్లో వరి సాగవగా చాలా వరకు కోత దశలో ఉంది. ప్రభుత్వం అధ్వర్యంలో పాఠశాలల్లో ఏర్పాటు చేసే సహాయక శిబిరాల్లో ప్రజలు బస చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేసింది. పరిస్థితి మరింత దిగజారితే ఆహార ప్యాకెట్లు, నీరు, మందులు, సదుపాయాలను కూడా నిల్వ చేసింది జిల్లా యంత్రాంగం.