తాజాగా ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సైతం ఇలాంటి మోసానికి గురయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఏకంగా రూ. 87 లక్షలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేటకు చెందిన ఓ వ్యక్తికి గత నెలలో వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. సదరు మెసేజ్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్‌లో హోటల్స్, రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తే రోజు డబ్బులు ఇస్తామని…
రోజురోజుకీ టెక్నాలజీ ఎంతలా పెరుగుతుందో నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మారుతోన్న టెక్నాలజీని తమకు అనుగుణంగా మార్చుకుంటే కొందరు నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మనిషి అత్యాశనే పెట్టుబడిగా మార్చుకొని లక్షలు కాజేస్తున్నారు. పార్ట్ టైమ్ జాబుల పేరిట కుచ్చుటోపి పెడుతున్నారు. అయితే ఇలాంటి మోసాల బారిన పడుతోన్న వారిలో విద్యా వంతులు, ఉద్యోగులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సైతం ఇలాంటి మోసానికి గురయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఏకంగా రూ. 87 లక్షలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేటకు చెందిన ఓ వ్యక్తికి గత నెలలో వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. సదరు మెసేజ్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్‌లో హోటల్స్, రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తే రోజు డబ్బులు ఇస్తామని ఆశచూపారు. దీంతో నిజమేనని నమ్మిన సదరు వ్యక్తి వాళ్లు చెప్పిన విధంగా చేశాడు.
మొదట కొన్ని లింకుపు పంపి రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వాలని కోరారు. అలా చేయడంతో కొంత డబ్బు కూడా ఇచ్చారు. అనంతరం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటూ ఓ లింక్ పంపారు. బాధితుడు అందులో లాగిన్ అయ్యి తొలుత రూ. వెయ్యి పెట్టుబడి పెట్టాడు. వెంటనే రూ. 1420 తిరిగి చెల్లించారు. క్షణాల్లో రూ. 420 లాభం రావడంతో నమ్మకం పెరిగింది. ఇంకేముంది ఇక్కడే సైబర్ నేరగాళ్లు తమ కన్నింగ్ ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేశారు.
నమ్మకం పెంచుకున్న తర్వాత క్రమంగా పెట్టుబడి పెంచమంటూ కోరారు. అలా పలు సార్లు ఏకంగా రూ. 86.96 లక్షలను పెట్టుబడిగా వసూలు చేశారు. అయితే తిరిగి కేవలం రూ. 9,970 మాత్రమే తిరిగి చెల్లించారు. ఎన్‌ఐఈఎల్‌ఐటీ సంస్థ పేరుతో ఈ మోసం చేశారు. దీంతో ఎన్నిసార్లు డబ్బులు అడిగిన అవతలి నుంచి సమాధానం లేకపోవడంతో మోసపోయాననే విషయం స్పష్టమైంది. వెంటనే అలర్ట్ అయిన సదరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.