:యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ కె. నటరాజ్
అచ్యుతాపురం, నవంబర్ 3 (ఆంధ్రపత్రిక) : యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ హెడ్ కె. నటరాజ్ కోరారు. క్రెడిట్ క్యాంప్ నిర్వహణలో భాగంగా బ్యాంక్ ఖాతాదారులకు 5కోట్ల 50 లక్షలు రుణాలు మంజూరు పత్రాలు రుణ గ్రహీతలకు అందజేశారు. యలమంచిలి క్లస్టర్ లో భాగంగా నరసింగపల్లి, ఎలమంచిలి, అడ్డరోడ్డు, ఎస్ రాయవరం, చిన దొడ్డిగల్లు,ఆచ్చుతాపురం మండలాలలో జరిగిన కార్య్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రుణాలు మంజూరు చేస్తుందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ తో నటరాజ్, అర్ ఎల్ పి అనకాపల్లి హెడ్ వై. శంకర్, యలమంచిలి బ్రాంచ్ మేనేజర్ వి. ఎస్ బ్రహ్మ నాయుడు, అడ్డరోడ్డు, ఎస్ రాయవరం బ్రాంచ్ మేనేజర్ ధర్మారావు,అచ్చుతాపురం బ్రాంచ్ మేనేజర్ డి. రాజేష్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.