CSK vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్స్‌లో ఇంకా ఆ టీమ్ బెర్త్ కన్ఫర్మ్..
CSK vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్స్‌లో ఇంకా ఆ టీమ్ బెర్త్ కన్ఫర్మ్ కాలేదు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ధోని నేతృత్వంలోని చెన్నై టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగుల తక్కువ స్కోర్‌నే చేయగలిగింది. దీంతో 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత తడబడినా విజయం సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో నైట్ రైడర్స్ తరఫున నితీష్ రాణా(57, నాటౌట్), రింకూ సింగ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక చెన్నై బౌలర్లో దీపక్ చాహర్ మాత్రమే 3 వికెట్లు తీసుకున్నాడు.
అయితే నేటి గెలుపుతో కోల్‌కతా టీమ్ ఖాతాలో మరో విజయం చేరినట్లయింది, కానీ ప్లేఆఫ్స్‌లో నైట్‌రైడర్స్ ఉంటుందా అంటే అనుమానమే అన్నట్లుగా ఉంది టోర్నీలోని పరిస్థితి. అలాగే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తన చివరి మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌లో చెన్నై స్థానం పొందగలుగుతుందా లేదా అనే సస్పెన్స్ ఇప్పుడు నెలకొంది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 17, డెవాన్ కాన్వే 30 తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. అనంతంర వచ్చిన వారిలో శివమ్ దుబే 48 (నాటౌట్) రాణించినా.. రహానే 16, జడేజా 20 కూడా తక్కువ పరుగులే చేయగలిగారు. ఇక చివర్లో వచ్చిన ధోని 3 బంతుల్లో రెండే పరుగులు చేసి అజేయంగా చెన్నై ఇన్నింగ్స్ ముగించాడు. మరోవైపు కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు, శార్ధుల్ ఠాకూర్, వైభవ్ అరోరా తలో వికెట్ తీసుకున్నారు.
ఇరుజట్ల వివరాలు..:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్/కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.