ఐపీఎల్ 2023 సీజన్ నేటితో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముగియనుంది. చివరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై ఐదోసారి టైటిల్ గెలుస్తుందా లేక గుజరాత్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలువనుందా అన్నది తేల్చనుంది.
ఐపీఎల్ 2023 సీజన్ నేటితో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముగియనుంది. చివరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై ఐదోసారి టైటిల్ గెలుస్తుందా లేక గుజరాత్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలువనుందా అన్నది తేల్చనుంది. అయితే అంతకు ముందే వరుణుడు ఎంట్రీ ఇచ్చేశాడు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఈరోజు మ్యాచ్ సమయానికి ప్రారంభం కాలేదు. ఇంతవరకు టాస్ కూడా పడలేదు. ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ నేడు వర్షంతో మ్యాచ్ నిర్వహించలేకపోతే ఏం జరుగుతుందనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది.
వర్షం అంతరాయం కలిగిస్తే?
IPL అధికారిక వెబ్సైట్, t20.com లో, వర్షం విషయంలో అనేక నియమాల గురించి సమాచారం అందించారు. వీటిలో కొన్ని పాయింట్లను ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షం కారణంగా ఈరోజు మ్యాచ్ ఆడలేకపోతే దానికి ‘రిజర్వ్ డే’ నిబంధన ఉంది. కానీ, ఐపీఎల్ 2023కు మాత్రం రిజర్వ్ డే లేదు.
ఇక 20-20 ఓవర్ల మ్యాచ్‌ని పూర్తి చేయడమే తొలి ప్రయత్నం. అంటే రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాకపోతే 9.35 గంటల వరకు ఆగాల్సిందే. ఆ సమయానికి మ్యాచ్ ప్రారంభమైతే.. ఓవర్లు తగ్గకుండా మ్యాచ్ మొత్తం జరుగుతుంది.
ఇది సాధ్యం కాకపోతే కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్‌కు ప్రయత్నిస్తారు. ఇందుకోసం తెల్లవారుజామున 12.06 గంటల వరకు వెయిట్ చేస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే మాత్రం సూపర్ ఓవర్‌తో ఫలితాన్ని రాబట్టే ఛాన్స్ ఉంది.
అయితే, ఐపీఎల్ 2023 ట్రోఫీని సంయుక్తంగా పంచుకోలేరు. అంటే, ఉమ్మడి విజేత ఎవరూ ఉండరు. విజేత కోసం లీగ్ దశ పాయింట్ల పట్టిక తీసుకుంటారు. అక్కడ మొదటి స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ పరిస్థితిలో గుజరాత్ టైటాన్స్ టైటిల్ కైవసం చేసుకోనుంది.