దిగ్విజయ్‌కు చక్కదిద్దే బాధత్యలు?
- త్వరలో టి.కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ సమావేశం
- దిగ్విజయ్‌కు టీ కాంగ్రెస్ అడ్వయిజర్ భాధ్యత అప్పగింత
న్యూఢల్లీి,డిసెంబర్ 20 : తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. ఒకవైపు సీనియర్ల వివాదం.. మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతల రాజీనామాల పర్వం.. వెరసి పెను సంక్షోభానికి దారి తీసింది. తమకు పదవులు ఇవ్వడంతో సీనియర్ నేతలంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని.. కాబట్టి తమ పదవులను వారికి కట్టబెట్టాలని రాజీనామా చేసిన 12 మంది నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే సీనియర్లు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన అధిష్టానం టీ కాంగ్రెస్‌పై ఫోకస్ పెట్టింది. టీ కాంగ్రెస్‌లో సంక్షోభానికి తెరదించే భాధ్యతను దిగ్విజయ్ సింగ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్‌కు టీ కాంగ్రెస్ అడ్వయిజర్ భాధ్యతను అప్పగించినట్టు సమాచారం. త్వరలో టి.కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ సమావేశ కానున్నట్టు తెలుస్తోంది.