మచిలీపట్నం నవంబర్ 20 ఆంధ్ర పత్రిక.
ధాన్యం సేకరణ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తామని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను హెచ్చరించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ పెద్ది రోజా, జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం సేకరణ, వసతి గృహాల తనిఖీ-మరమ్మతులు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ కార్యక్రమం మొదలైన దృష్ట్యా ఎక్కడ కూడా ఎలాంటి లోటు పాట్లు లేకుండా పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో పాటు సహకార శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సంవత్సరం ధాన్యం సేకరణలో రైతులకు ఏలాంటి సమస్య రాకూడదని స్పష్టం చేస్తూఎట్టి పరిస్థితులలోఎవరు కూడా అవకతవకులకు పాల్పడితే సహించేది లేదని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు బనాయిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతు భరోసా కేంద్రాల పనితీరు పరిశీలించాలన్నారు.మండల వ్యవసాయ అధికారులు రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉండి ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉందా లేదాగమనించాలన్నారు.
ఇంజనీరింగ్ విభాగానికి అందజేయాలన్నారు. తక్షణమే మరమ్మతు చేయవలసిన భవనాలకు సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సిద్ధం చేసి పంపాలన్నారు.
జిల్లా అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో వివిధ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసి వాటి స్థితిగతుల వివరాలను ఇంజనీరింగ్ విభాగానికి అందజేయాలన్నారు. తక్షణమే మరమ్మతు చేయవలసిన భవనాలకు సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సిద్ధం చేసి పంపాలన్నారు.
అలాగే జిల్లా సహకార అధికారి కూడా తనిఖీలు చేసి ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా నడుస్తుందా లేదా పరిశీలించాలన్నారు.
ఓటర్ల జాబితా పరిశీలకులుగా నియమించబడిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి బి శ్రీధర్ ఈనెల 22వ తేదీన జిల్లాకు రానున్నారన్నారు. ఆలోగా ఎన్నికల అధికారులు వారి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు-జనాభా నిష్పత్తి, స్త్రీ పుంలింగ నిష్పత్తి యువ ఓటర్లకు సంబంధించిన రికార్డులు, బూతు స్థాయి అధికారుల రిజిస్టర్లు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.