మచిలీపట్నం నవంబర్ 19 ఆంధ్ర పత్రిక.:
వేమవరంలో వేంచేసి ఉన్న కొండలమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు సోమవారం ఉదయం 9 గంటలకు, దేవస్థానం డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో కానూరి సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు సభ్యులు పాల్గొంటారని, ఆలయ మండపంలో హుండీ లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఆదివారం కొండలమ్మ అమ్మవారి 15వ వార్షికోత్సవ సందర్భంగా ప్రాతః కాలమే అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి రకరకాల పూలతో దేవస్థానం వారు పుష్పార్చన చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ శేషం వీర వెంకట కృష్ణమూర్తి, సభ్యులు, కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు, పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఆదివారం అశేష సంఖ్యలో కొండలమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 12 వేల మంది భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్దలతో దర్శించుకుని అమ్మ వారి కృపకు పాత్రులయ్యారు. భక్తులు తమ మొక్కుబడులు పాల పొంగళ్ళు అమ్మవారికి సమర్పించారు.బందరు గుడివాడ రోడ్డు భక్తులతో కిట కిట లాడింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకునే ఏర్పాట్లు ఆలయ నిర్వాహకులు చేశారు.