న్యూఢల్లీి, మార్చి 25 (ఆంధ్రపత్రిక) : దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో మళ్లీ ఆందోళన మొదలైంది. కొత్తగా 1,590 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 8,601కి చేరుకుంది. గడిచిన 146 రోజుల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల మొదలైందని వెల్లడిరచింది. ఈ కేసులతో పాటు ఈ ఒక్క రోజే కరోనా వల్ల ఆరుగురు చనిపోయారని స్పష్టం చేసింది. వారిలో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ కు చెందిన వారు ఒక్కొకక్కరు చొప్పున ఉన్నారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 910 మంది కోలుకోవడంతో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832కి చేరుకుంది. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు, వీక్లీ పాజిటివిటీ రేటు వరుసగా 1.33 శాతం,1.23 శాతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కరోనా జాగ్రత్తలు విధిగా పాటించాలని కేంద్రం, అన్ని రాష్టాల్రకు సూచిస్తోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!