కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
హైదరాబాద్,డిసెంబర్ 8 (ఆంధ్రపత్రిక): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారతీయ రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్)గా మార్పు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.ఈమేరకు గురువారం తెరాస అధినేత కేసీఆర్కు ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ అందింది. డిసెంబరు 9న మధ్యాహ్నం 1.20 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం, జెండా ఆవిష్కరణ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.