విజయవాడ,అక్టోబర్ 20 (ఆంధ్రపత్రిక): ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొన సాగు తూనే ఉంది. బుధవారం సాయంత్రానికి ఎగువ ప్రాంతం నుంచి బ్యారేజికి 3.36 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. బ్యారేజి 70 గేట్లు ఎనిమిది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణలంక 20, 21 డివిజన్ల పరిధిలోని కరకట్ట దిగువ ప్రాంతం ఇళ్లు రోజుల తరబడి వరద నీటిలోనే నానుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి నీటి ప్రవాహం తగ్గు ముఖం పట్టడం తో ప్రస్తుతం ఏడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధ వారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ఎగువ జూరాల నుండి 1,01,117 క్యూసె క్కులు, సుంకేసుల ద్వారా 51,732, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులతో కలిపి 1,52,9 66 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయానికి చేరుతోంది. జలా శయానికి ఉన్న ఏడు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి 1,94, 922 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!