నరసాపురం మొగల్తూరు నవంబర్ 26 (గోపరాజు సూర్యనారాయణ రావు) ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం సౌభతత్వం కోరుకునే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మొగల్తూరు మండల పివి రావు మాల మహానాడు అధ్యక్షుడు ఇంజేటి కుమారస్వామి అన్నారు. ఆదివారం మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన పూలమాలవేసి అనంతరం మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని పార్లమెంటులో ఆమోదించడంతో 2015 నుండి రాజ్యాంగ దినోత్సవాన్ని జరపమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అప్పటినుండి ఈరోజున భారత రాజ్యాంగ దినోత్సవం గా దేశమంతటా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సమ సమాజ తత్వం స్థాపనకే శ్రమించిన వ్యక్తి అంబేద్కర్ అని, కులమత బేధాలు లేకుండా అందరూ అన్నదమ్ముల భావంతో మెలగాలని కోరుకునే వ్యక్తిని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం కుల మతాలకు చిచ్చుపెట్టి ఓట్లు బ్యాంకు రాజకీయం కోసం పనిచేస్తున్నారని విషయాన్ని ప్రతి దళితుడు తెలుసుకొని అంబేద్కర్ ఆలోచన విధానానికి పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు మండల మాల మహానాడు ఉపాధ్యక్షుడు గూడపాటి బాపనయ్య, కేపీ పాలెం నార్త్ గ్రామ అధ్యక్షుడు గూడపాటి చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు బండారు రమేష్, ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీను, కార్యదర్శి నేతల రాజేష్ బాబు, పేరుపాలెం సెంటర్ అధ్యక్షుడు కత్తిమండ నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు నల్లి రమేష్ మొగల్తూరు మండల కార్యదర్శి పిడకల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.