కేంద్రంపై మండిపడ్డ అరవింద్ కేజ్రీవాల్
న్యూఢల్లీి,అక్టోబర్ 17 (ఆంధ్రాత్రిక): కేంద్ర ప్రభుత్వంపై ఢల్లీి సీఎం అరవింద్ కేజీవ్రాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మద్యం పాలసీ కుంబ óకోణం కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు వెళ్తున్న క్రమం లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను అరవింద్ కేజీవ్రాల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘నేను స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్‌ను అనుసరించే వాడిని. జైలుకు వెళ్లడానికి భయపడను. దేశం కోసం భగత్ సింగ్ కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది‘ అంటూ మనీష్ సిసోడియా ఉద్వేగంగా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢల్లీి లిక్కర్ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసో డియాపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయన్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విజయ్ నాయర్ ను ఎందుకు కలిశారు ? మద్యం పాలసీ విధా నంలో ఆయ నను ఎందుకు భాగస్వామ్యం చేశారు అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. కొత్త మద్యం పాలసీ వల్ల ఢల్లీి ప్రభుత్వం ఆదాయం పడిపోతుందని విూకు తెలియదా? అలా చేయడం వల్ల ప్రభుత్వంలో ఎవరు లబ్ది పొందు తారనే క్వశ్చన్స్‌ను సంధిస్తున్నారు. కొత్త మద్యం పాలసీలో కొద్దిమంది వ్యాపారులనే ఎందుకు ఎంపిక చేశారని మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రభుత్వం, వ్యాపారస్తుల మధ్య క్విడ్ ప్రొకో జరిగిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపకల్పనలో తెలంగాణ వ్యక్తులను కలిశారా అని ప్రశ్నించి నట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రామచంద్ర పిళై, శరత్ చంద్ర, రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు