న్యూఢల్లీి,సెప్టెంబర్ 24 (ఆంధ్రపత్రిక): కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి 22న నోటిఫికేషన్ విడుదలయ్యింది. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు బరిలో నిలుస్తారన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. అయితే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్‌ఇనక జరిపించామని చెప్పడానికి ఈ తంతు అన్నచందంగా ఉంది. ఎవరు అధ్యక్షుడయినా మళ్లీ సోనియా, రాహుల్‌దే పెత్తనం అని పార్టీలో ప్రచారం ఉంది. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండబోరని రాహుల్ గాందీ óరెండ్రోజుల క్రితం స్పష్టం చేశారు. దీంతో తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని రాహుల్ గాంధీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. రాహుల్ ప్రకటనతో పలువురు సీనియర్ నేతలు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అధ్యక్ష రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశ్లోక్ గెహ్లాట్ అందరికంటే ముందున్నారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని అశ్లోక్ గెహ్లాట్ శుక్రవారం నాడు స్వయంగా వెల్లడిరచారు.
కేరళలో రాహుల్ గాంధీని భారత్ జోడో యాత్రలో కలిసిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అటు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధ్యక్ష ఎన్నిక అనివార్యంగా తెలుస్తోంది. వీరిద్దరితో పాటు మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, పృథ్వీరాజ్ చవాన్ తదితరులు కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగుతోంది. అయితే వీరిలో కొందరు తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. జబల్పూర్లో విూడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. తాను పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది వరకే ఈ విషయాన్ని స్పష్టంచేశానని.. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పునరుద్ఘాటిస్తున్నట్లు చెప్పారు. అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడు అయితే.. ఆయన స్థానంలో రాజస్థాన్ కొత్త సీఎం ఎవరు అవుతారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తాను రాజస్థాన్ ప్రజాప్రతినిధిని కానంటూ వ్యాఖ్యానించారు.
ఢల్లీిలో మసీదు, మదర్సాను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సందర్శించడంపై దిగ్విజయ్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రెండు వారాలు పూర్తి చేసుకున్న ఫలితమే ఇదని వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్ర తర్వాత పరివర్తన పొందినందుకు మోహన్ భగవత్‌ను అభినందిస్తున్నట్లు కామెంట్ చేశారు. సంఫ్‌ు పరివార్‌లోని కింది స్థాయి వ్యక్తుల్లో కూడా ఇదే రకమైన పరివర్తన చెందాలని సూచించారు. మత ప్రాతిపదికన సమాజంలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నాలను ఆర్ఎస్ఎస్ ఇకనైనా విరమించుకోవాలన్నారు. పార్టీ అంచనాలను మించి రాహుల్ యాత్రకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు కేవలం కంటితుడుపు చర్యగా బీజేపీ ఎద్దేవా చేసింది. ఎవరు ఆ పార్టీ అధ్యక్షులు అయినా వారు గాంధీల చేతిలో రిమోట్ కంట్రోల్ అవుతారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెప్ాజాద్ పూనవాలా ఎద్దేవా చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజస్థాన్ కొత్త సీఎం ఎవరన్నది సోనియాగాంధీ నిర్ణయిస్తారని అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏపాటిదో దీని ద్వారా అర్థం అవుతోందని విమర్శించారు. పార్టీ మాజీ అధ్యక్షురాలైన సోనియాగాంధీ ఏ హోదాలో రాజస్థాన్ కొత్త సీఎం ఎవరన్నది నిర్ణయిస్తారని ప్రశ్నించారు. కొత్త సీఎం ఎవరు కావాలని నిర్ణయం తీసుకునే అధికారం రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు లేదని ప్రశ్నించారు. పార్టీ కొత్త అధ్యక్షులు ఎవరైనా.. రాహుల్ గాంధీ పార్టీ అగ్రనేతగా ఉంటారంటూ మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తుచేశారు. గతంలో మన్మోహన్ సింగ్‌ను సోనియాగాంధీ రిమోట్ కంట్రోల్‌తో కంట్రోల్ చేశారని.. తదుపరి కొత్త పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇలాగే ఉంటారని అన్నారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం కొత్త పార్టీ అధ్యక్షులకు ఉండబోదన్నారు. అధ్యక్ష ఎన్నిక పక్రియ పూర్తిగా ఫేక్ అంటూ విమర్శించారు.