న్యూఢల్లీి,డిసెంబర్ 27 (ఆంధ్రపత్రిక): కోవిడ్ కలవరం మళ్లీ మొదలైన నేపథ్యంలో.. మంగళవారం దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో మాక్ డ్రిల్ చేపట్టారు. ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆస్పత్రులు అన్నీ సంసిద్దం అవుతున్నాయి. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారి కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కొవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ కొనసాగుతోంది.. ఆరోగ్య సౌకర్యాలు, ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, డాక్టర్లు, నర్సులు, ఆయుష్ డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల లభ్యత.. అలాగే అంబులెన్సు, పరీక్షా పరికరాలు, అవసర మైన మందులు తదితర అంశాలపై సవిూక్షిస్తున్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య మంత్రులు ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్ పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్ పడకల లభ్యతను సవిూక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిపై దృష్టి సారించారు. చైనా, జపాన్ సహా వివిధ ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. దీంతో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో నిర్థారణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని రాష్ట్రాలు మాస్కులను తప్పనిసరి చేశాయి. ఢల్లీిలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించారు. నగరంలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్లో మంత్రి మాండవీయ పరిశీలించారు. ఇలాంటి డ్రిల్ చేపట్టడం వల్ల మనం ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నామో తెలుస్తుందని, ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే వీలవుతుందని మంత్రి మాండవీయ తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్లోనూ ఇవాళ కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కోవిడ్ పేషెంట్లు పెరిగితే అప్పుడు ఎలాంటి చికిత్సను అందించా లో హాస్పిటల్ సిబ్బంది సిద్ధం చేశారు. ఎంత వరకు సంసిద్దంగగా ఉన్నామో పరిశీలన చేసుకుంటున్నామని గాంధీ ఆస్పత్రి అధికారులు తెలిపారు. డ్రిల్‌లో భాగంగా కీలకమైన ఆరోగ్య సౌకర్యాల గురించి పరిశీలించ నున్నారు. ఐసోలేషన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్ ,బెడ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోనున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!