న్యూఢల్లీి, ఫిబ్రవరి 20 : ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పని చేస్తున్న అమరరాజా బ్యాటరీస్ కాలుష్య వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.ఏపీ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసింది. అయితే, సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.అమర రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, దీనివల్ల పరిసర ప్రాంతాల జలాల్లో సీసం ధాతువులు పెరుగుతున్నందున సంస్థను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సదరు నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ బ్యాటరీస్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ కారణాలతో ఇప్పటి వరకు 34సార్లు నోటీసులు ఇచ్చి తమను వేధిస్తున్నారని అమర రాజా తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణరావు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. షోకాజ్ నోటీసులపై చట్టప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపి నిర్ణయం తీసుకోవాలని పీసీబీకి సుప్రీం కోర్టు ఆదేశించింది. నోటీసులపై న్యాయ పరిష్కారాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత జారీ చేసే ఉత్తర్వులను నాలుగు వారాల పాటు నిలుపుదల చేయాలని తెలిపింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!