అవనిగడ్డ, అక్టోబర్ 20 (ఆంధ్రపత్రిక): ఇది మం చికి.. మోసానికి జరుగుతున్న యుద్ధమని పేద వాడికి.. పెత్తందారుడికి, సామాజిక న్యాయానికి.. సమాజాన్ని ముక్కలు చెక్కలు చేయా లనుకుంటున్న వాళ్లకు మధ్య జరుగుతన్న యుద్ధ మని.. ఇలాంటి యుద్ధంలో కుట్రలు, కుతంత్రా లు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిప ిస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోను మంచి జరి గింది అంటేనే నాకు తోడుగా నిలబడండి. ఈ బిడ్డకు మీ గుండెలో చోటు ఇవ్వండి అని జగన్ ఆకాంక్షించారు. కృష్ణాజిల్లా, అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన నిషేధిత భూ సమస్యల పరిష్కార సభలో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత సీఎం చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైనా భూములకు కచ్చి తమైన రికార్డులు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 100 ఏళ్ల తర్వాత మహా యజ్ఞులా భూ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందుకోసం 15వేల మంది సర్వేయర్లను రిక్రూట్ చేశాం. అత్యాధునిక పరికరాలైన విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఇందుకోసం ఉపయోగిస్తున్నాం. భూముల రీసర్వేతో రికార్డులన్నింటినీ అప్డేట్ చేస్తున్నాం. చుక్కల భూములని, అనాధీన భూములని ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూముల రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వాలు ఆలోచించలేదు. భూముల, స్థిరాస్తుల యాజమానులకు హక్కు పత్రాలు ఇవ్వబోతున్నాం. నవంబర్లో 1500లకు పైగా గ్రామాల్లో సర్వే చేసి అసలు పూర్తిగా చెరుకువేసి చుక్కలు, 22ఎ వంటి భూములకు విముక్తి కలిగించి స్థిర హక్కు పత్రాలు అందించేందుకు దీక్ష చేపట్టాం. భూములకు, స్థిరాస్తులకు పక్కా హద్దులు నిర్ణయిస్తాం. వచ్చే ఏడాది చివరికల్లా ఈ సర్వే కార్యక్రమాన్ని 100% పూర్తి చేస్తాం. సబ్ రిజిస్టార్ కార్యాలయం గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నాం. వీటివల్ల రిజిస్ట్రేషన్ లో ఏమైనా అక్రమాలు జరిగితే సులభంగా తెలుసుకునేందుకు వీలుంటుంది. రాష్ట్రంలో 355 గ్రామాల్లో 22ఏ జాబితాలోని 18889 మంది రైతులకు చెందిన 35669 ఎకరాలలో 22042 ఎకరాల రైతులకు సర్వహక్కులతో కూడిన పట్టాలను అందించే కార్యక్రమం చేపట్టాం. అవనిగడ్డ నియోజకవర్గంలో 15,791 ఎకాలు, 10,019 మంది రైతన్నలకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేరుస్తూ 2016లో జీవో ఇచ్చింది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి రైతులకు మేలు సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు.
గత పాలకులు తాము చేసిన మంచేంటో చెప్పలేని దుస్థితికి చేరుకున్నారు. పేదవాడి బాగోగులు పట్టించుకునే ప్రభుత్వం చేయరు. పైగా ఎన్నికల తర్వాత వాళ్లు వాగ్దానాలు మరిచిపోతారు. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు నెరవేర్చాం. మూడు రాజధానుల వల్ల మంచి జరుగుతోందని చెప్తున్నాం. కానీ కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు. దత్త పుత్రుడితో ఏం మాట్లాడిస్తున్నారో మనమంతా చూస్తున్నాం. మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్లు టీవీల్లో ఇలాంటి సందేశాలతో ఏం చెప్పాలనుకుంటున్నారు. వాళ్లు అలా మాట్లాడడం మొదలుపెడితే మన ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి?. ఇలాంటివాళ్లా మన నాయకులు? ఇలాంటి నాయకులు మనకు దిశ దశ చూపగలారా?.. ఒక్కసారి ఆలోచించండి అని జగన్ ప్రజలను కోరారు. ఇటువంటి దుష్టచతుష్టయం కూటమిగా ఏర్పడి.. మీ బిడ్డ అయినా నా మీద.. ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట.. ఒక్క జగన్ను కొట్టడానికి ఇంత మంది ఏకం కావడం ఆశ్చర్యంగా అనిపిస్తుందని అన్నారు. కుతంత్రాలను, కుళ్లును, మీడియాను, దత్తపుత్రుడిని వాళ్లు నమ్ముకుంటే.. తాను మాత్రం ప్రతీ అవ్వాతాతా, అక్కాచెల్లి, అన్నదమ్ములని నమ్ముకున్నానని తెలిపారు. మోసాలను నమ్మొద్దు.. ఈ యెల్లో మీడియాను పట్టించుకోవద్దు.. మంచిని మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ప్రజలను కోరారు. పచ్చ రంగు పెత్తందారుల ఓటమితో యుద్ధం సాగుతోందని తన వెంట ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడు లేకపోవచ్చు దేవుని దయతో నావల్ల మంచి జరిగిన ప్రతి కుటుంబంలో అందరూ ఈ యుద్ధంలో నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్న అని అన్నారు.అనంతరం నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేసే కార్యక్రమాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించారు. దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకుల నరసింహారావు ముఖ్యమంత్రి జగన్ కు చెక్కతో తయారుచేసిన నాగలిని బహుకరించారు. రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వచ్చే నెలలో ప్రారంభమయ్యే భూ సర్వే సమర్థవంతంగా, ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా స్పష్టంగా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, జ్యోతి రమేష్, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసోరి, కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు
అవనిగడ్డ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వరాల జల్లు
అవనిగడ్డ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని 22ఏ జాబితాలోని నిషేధిత భూములకు బటన్ నొక్కి రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించి విముక్తి కల్పించడంతోపాటు కోడూరు నగాయనగాయలంక ప్రాంతాల మధ్య రహదారి నిర్మాణానికి 35 కోట్లు. ఎడ్ల లంక గ్రామస్తులకు వంతెన మార్గం నిర్మాణం కొరకు 8.5 కోట్లు, కృష్ణా నది కరకట్టకు 25 కోట్లు, అవనిగడ్డలోని కంపోస్ట్ యార్డ్ తరలింపుకు 5 నుంచి 8 కోట్లు, సీసీ డ్రైన్లు
కొరకు పది నుంచి 15 కోట్లు, అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కొరకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు వీటన్నిటికీ ఆమోదం తెలిపారు. అడిగిన వెంటనే నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేందుకు కోట్ల ఐదు రూపాయల పనులకు అనుమతి ఇచ్చినందుకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రికి తెలిపారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!